CM YS Jagan: విశాఖపట్నం పర్యటనకంటే ముందు తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో పురపాలక పట్టణాభివృద్ధి శాఖపై సమీక్ష నిర్వహించారు సీఎం వైఎస్ జగన్.. ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు చెందిన సుమారు 50 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కోసం తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా సీఎంకు వివరించారు అధికారులు. 1402.58 ఎకరాల్లో 50,004 మందికి పట్టాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.. మొత్తం 21 లేఔట్లలో పేదలకు ఇళ్లపట్టాలు ఇస్తామని తెలిపారు.. గుంటూరు జిల్లాకు చెందిన లబ్ధిదారులకు 10 లేఔట్లలో, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన లబ్ధిదారులకు 11 లేఔట్లలో ఇళ్ల పట్టాలు ఇస్తామన్నారు.. ఈ స్థలాల్లో మౌలిక సదుపాయాలు కల్పనకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలరు జారీ చేశారు.
Read Also: DOST Applications : ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ ప్రవేశాల షెడ్యూలు విడుదల
జంగిల్ క్లియరెన్స్, ల్యాండ్ లెవలింగ్ పనులు పూర్తి చేయాలని తెలిపారు సీఎం వైఎస్ జగన్.. దాదాపు 180 కిలోమీటర్ల మేర అంతర్గత గ్రావెల్ రోడ్లు వేసే పనులు కొనసాగుతున్నట్టు తెలిపారు.. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు నిరుపేదల చిరకాల ఇంటి కలను తీర్చే బృహత్త కార్యక్రమం.. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనను వెంటనే పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు ఏపీ సీఎం… ఇక, రివర్ బెడ్ పై వాకింగ్ ట్రాక్ సహా చేపడుతున్న వివిధ బ్యూటిఫికేషన్ పనులను సీఎం జగన్ కు వివరించారు అధికారులు. అయితే, విజయవాడలో కృష్ణానది వరద ముప్పు నుంచి తప్పించేందుకు నిర్మించిన రిటైనింగ్ వాల్ ద్వారా ఏర్పడ్డ రివర్ బెడ్‌ను అందంగా తీర్చిదిద్దాలన్న సీఎం.. విజయవాడ నగర వాసులకు ఆహ్లాదం కలిగించేలా దీన్ని తీర్చిదిద్దాలని ఆదేశించారు.
మరోవైపు.. విశాఖపట్నంలో బీచ్‌ల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్.. దీనికి అవసరమైన ప్రత్యేక యంత్రాలను బీచ్‌లో అందుబాటులో ఉంచాలన్న ఆయన.. వీటి ద్వారా బీచ్‌లో వ్యర్థాలను తొలగించాలని సూచించారు.. పరిశుభ్రమైన బీచ్‌లతోనే పర్యాటక రంగం మరింత మెరుగు పడుతుందని పురపాలక పట్టణాభివృద్ధి శాఖపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో స్పష్టం చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.