NTV Telugu Site icon

CM YS Jagan: వైఎస్‌ వివేకా కేసు.. సీఎం జగన్‌ సంచలన వ్యాఖ్యలు

Cm Jagan

Cm Jagan

CM YS Jagan: తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సంచలన వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. పులివెందులలో నామినేషన్‌కు ముందు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. నా ఇద్దరు చెల్లెమ్మలతో కుట్రలు చేస్తూ రాజకీయాలు చేస్తున్నారు.. మా వివేకం చిన్నానను ఎవరు చంపారో.. ఎవరు చంపించారో, ఆయనకు ఆ దేవుడికి ఈ జిల్లా ప్రజలందరికీ తెలుసన్నారు సీఎం జగన్‌.. మా ఇద్దరి చెల్లెమ్మలను ఎవరు పంపించారో ప్రజలందరికీ తెలుసు.. వివేకం చిన్నానను అతి దారుణంగా చంపి బహిరంగంగా తిరుగుతున్న హంతకుడికి మద్దతు ఇస్తున్నది ఎవరు..? అని ప్రశ్నించారు. నాన్నను అన్యాయంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన వారితోనే సంఖ్యాబలం లేకపోయినా కూడా, అధికార బలంతో ఓడించిన వారితోనే చట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నది ఎవరు..? చిన్నానకు రెండవ భార్య ఉన్నమాట వాస్తవమా కాదా..? రెండవ భార్యకు కొడుకు ఉన్నాడా లేడా ఉన్నది వాస్తవమా కాదా..? అని బహిరంగ సభలో ప్రశ్నించారు జగన్..

Read Also: Kolikapudi Srinivasa Rao: తిరువూరులో గెలుపే లక్ష్యంగా కొలికపూడి సుడిగాలి ప్రచారం..

ఇక, నోటా కు వచ్చిన ఓట్లు కూడా రాని కాంగ్రెస్‌తో.. రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్ తో రాష్ట్రానికి అన్యాయం చేసిన కాంగ్రెస్‌లో చేరి వైయస్సార్ పేరును ఛార్జిషీట్‌లో పెట్టిన వారికి ఓటు వేయడం ఎవరికి లాభం..? అంటూ పరీక్షంగా వైఎస్‌ షర్మిలను నిలదీశారు సీఎం జగన్‌.. ఓట్లు చీల్చడం వల్ల ఎవరికి లాభం బాబుకు కాదా…? ఓట్లు చీల్చి కూటమిని గెలిపించాలని చూడడం కాదా…? ఇలాంటివారు వైయస్సార్ కు వారసులా లేక, చంద్రబాబుకు వారసులా ప్రజలే సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు. నా కుటుంబ సభ్యులను డబ్బు సంపాదించడం కోసం కాదు.. భగవంతుడు మీ బిడ్డకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది.. జగన్ సీఎం అయినంక కుటుంబ సభ్యులను పక్కన పెట్టాడని అంటున్న కుటుంబ సభ్యులకు చెబుతున్న వైఎస్ అవినాష్ తప్పు చేయలేదని టికెట్ ఇచ్చాను అని స్పష్టం చేశారు జగన్.. వైఎస్‌ అవినాష్ జీవితం నాశనం చేయాలని కుట్రలో భాగమవుతున్నారు.. ఏ ప్రభుత్వ పథకం మంజూరులో అయినా లంచం లేకుండా 2.70 వేల కోట్ల రూపాయలు మంజూరు చేస్తాం.. జగన్ ను పాలనలో కొట్టలేరు, ప్రజలకు చేసిన మంచిలో కొట్టలేరు, పిల్లలకు చేసిన మంచిలో కొట్టలేరు, జగన్ ను రైతులు అందించిన రైతు భరోసాల్లోను కొట్టలేరన్నారు. మన బ్రాండ్ కడప, మన బ్రాండ్ వైయస్సార్, మన బ్రాండ్ పులివెందులను కొట్టాలనుకునే వారికి ఓటు ద్వారా గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. పులివెందుల ప్రజల చిరకాల కోరిక మెడికల్ కాలేజ్, నాన్న కలలు కన్న కాలేజ్ మెడికల్ కాలేజ్… నాన్నగారి మరణం తర్వాత పదేళ్లపాటు పులివెందులను ఎవరైనా పట్టించుకున్నారా..? అని ప్రశ్నించారు. మీ బిడ్డ సీఎం అయిన తర్వాతనే పులివెందుల అభివృద్ధి చెందింది.. వచ్చే ఐదేళ్లలో మీ అండతో పులివెందులతో పాటు రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తా… చరిత్రలో కని విని ఎన్నడూ ఏరుగని మెజారిటీ ఇచ్చిన ఈ గడ్డ, మరో దాన్ని తిరగరాయాలని పిలుపునిచ్చారు సీఎం వైఎస్‌ జగన్‌.