CM YS Jagan Pays Tribute to YSR: దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 74వ జయంతి వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహించారు ఆయన అభిమానులు, కాంగ్రెస్ శ్రేణులు.. ఇక, ఏపీలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరుగుతున్నాయి.. ఇడుపులపాయలో ఘనంగా వైఎస్ జయంతి నిర్వహించారు. వైఎస్సార్ ఘాట్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతి, ఆయన తల్లి వైఎస్ విజయమ్మ ఇతర కుటుంబ సభ్యులు నివాళులర్పించారు.. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతపురం జిల్లా పర్యటన ముగించుకుని నేరుగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్దకు చేరుకున్న సీఎం జగన్.. కుటుంబ సభ్యులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Read Also: Top Headlines @ 5 PM: టాప్ న్యూస్
ఇక, అంతకు ముందే.. వైఎస్సార్ ఘాట్ వద్ద వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల నివాళులర్పించారు. కుమారుడు, కూతురు.. ఇతర కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్సార్ ఘాట్‌కు వచ్చిన షర్మిల.. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మరోవైపు.. ఎంపీ అవినాష్‌రెడ్డి పూలమాల వేసి వైఎస్ సమాధి దగ్గర నివాళర్పించారు. కాగా, వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో నిర్వహించిన వైఎస్సార్ రైతు దినోత్సవంలో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్.. 2022 ఖరీఫ్‌లో నష్టపోయిన రైతులకు పంటల భీమా పరిహారాన్ని అందించిన విషయం విదితమే.. అంతేకాకుండగా.. డాక్టర్ వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్‌ను ప్రారంభించారు సీఎం వైఎస్ జగన్.