CM YS Jagan: సొంత జిల్లాలో మూడు రోజుల పర్యటనకు వెళ్లిన సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. తన రెండో రోజు పర్యటనలో భాగంగా ఈ రోజు ఉదయం ఇడుపులపాయలోని దివంగత నేత వైఎస్సార్ ఘాట్‌కు వెళ్లారు.. మహానేత వైఎస్సార్‌కు నివాళులర్పించారు సీఎం వైఎస్ జగన్, ఇతర కుటుంబ సభ్యులు, పలువురు వైసీపీ నేతలు.. ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు సీఎం జగన్, ఆయన సతీమణి వైఎస్ భారతి, ఇతర కుటుంబ సభ్యులు.. అనంతరం ప్రార్థనా మందిరానికి చేరుకుని ప్రార్థనల్లో పాల్గొంది సీఎం ఫ్యామిలీ..
Read Also: Coronavirus Cases: కరోనా వైరస్ విజృంభణ.. ఒక్కరోజే 104 కొత్త కేసులు నమోదు!
ఆ తర్వాత పులివెందుల మండల నాయకులతో సీఎం జగన్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.. ఎంపీ అవినాష్‌రెడ్డి, జడ్పీ ఛైర్మన్ అమర్‌నాథ్‌రెడ్డి, కలెక్టర్ విజయరామరాజు, స్థానిక నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.. ఇక, వైఎస్సార్ ఘాట్ వద్ సీఎం వైఎస్ జగన్‌తో పాటు మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ విజయ్ రామరాజు, జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథరెడ్డి, ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, మేయర్ సురేష్ బాబు సహా తదితరులు నివాళులు అర్పించారు. మరోవైపు.. నేడు సింహాద్రిపురంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో పాల్గొననున్నారు సీఎం వైఎస్ జగన్..