NTV Telugu Site icon

YSR Death Anniversary: వైఎస్‌ ఘాట్‌ వద్ద సీఎం జగన్‌ నివాళి.. మీ ఆశయాలే నన్ను చేయిపట్టి నడిపిస్తున్నాయి..

Ysr Ghat

Ysr Ghat

YSR Death Anniversary: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఆయన అభిమానులు, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ, కాంగ్రెస్‌ నేతలు, శ్రేణులు నివాళులర్పిస్తున్నారు.. మహానేతతో తమకున్న అనుభందాన్ని గుర్తుచేసుకుంటున్నారు.. ఇక, ఆయన తనయుడు, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించారు. అక్కడ నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో.. తన తల్లి వైఎస్‌ విజయమ్మ, కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు, వైసీపీ నేతలతో కలిసి పాల్గొన్నారు. ఇక, సీఎం జగన్‌ కంటే ముందే.. ఆయన సోదరి వైఎస్‌ షర్మిల.. తన తండ్రి సమాధి దగ్గర నివాళులర్పించారు.

Read Also: Sajjala RamaKrishna Reddy: బరితెగించి అవినీతి.. చంద్రబాబుకు నేరుగా రూ.118 కోట్ల ముడుపులు..!

మరోవైపు.. తన తండ్రి వర్ధంతి సంద్భంగా సోషల్‌ మీడియా వేదికగా భావోద్వేగానికి లోనయ్యారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ”నాన్నా.. మీరు లేని లోటు ఎన్నటికీ తీర్చలేనిది. భౌతికంగా మా మధ్య లేకపోయినా ప్రజల గుండెల్లో చిరకాలం జీవించే లీడర్‌ మీరు. మీ పట్ల ప్రజలకున్న ప్రేమాభిమానాలు నాకు కొండంత అండగా నిలిచాయి. మీ ఆశయాలే సంక్షేమం, సమగ్రాభివృద్ధి లక్ష్యాల సాధనలో నన్ను చేయిపట్టి నడిపిస్తున్నాయి. వర్ధంతి సందర్భంగా మీకు ఘనంగా నా నివాళులు నాన్నా.” అంటూ ట్వీట్‌ చేశారు.