Memantha Siddham Bus Yatra: ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రం మొత్తాన్ని చుట్టేసే పనిలో పడిపోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సు యాత్రతో ప్రజల్లోకి వెళ్తున్నారు.. పులివెందుల నుంచి ప్రారంభమైన ఈ యాత్ర.. ఇప్పటికే మూడు రోజులుగా దిగ్విజయంగా సాగుతూ.. నాల్గో రోజుకు చేరుకుంది.. శుక్రవారం పెంచికలపాడు నుంచి రామచంద్రపురం, కోడుమూరు, హంద్రీ కైరవడి, గోనెగండ్ల మీదుగా రాళ్లదొడ్డి వరకు సాగింది యాత్ర.. ఆ తర్వాత కడిమెట్ల మీదుగా ఎమ్మిగనూరులోని వీవర్స్ కాలనీ సొసైటీ గ్రౌండ్ దగ్గర బహిరంగ సభలో ప్రసంగించారు సీఎం జగన్.. అనంతరం అరెకల్, ఆదోని క్రాస్, విరుపాపురం, బెణిగేరి, ఆస్పరి, చిన్నహుల్తి, పత్తికొండ బైపాస్ మీదుగా కేజీఎన్ ఫంక్షన్ హాల్ దగ్గర ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి చేరుకున్నారు.
Read Also: INDIA Alliance : బీజేపీతో ఇండియా కూటమి యుద్ధానికి రాంలీలా మైదానం రణరంగంగా మారనుందా ?
ఇక, నాల్గో రోజులో భాగంగా ఈ రోజు కర్నూలు జిల్లాలో నుంచి అనంతపురంలోకి ప్రవేశించనుంది మేమంతా సిద్ధం బస్సు యాత్ర.. ఈ రోజు ఉదయం 9 గంటలకు పత్తికొండలోని రాత్రి బస చేసిన ప్రాంతం దగ్గర నుంచి బయల్దేరనున్న సీఎం జగన్.. రాతన మీదుగా తుగ్గలి చేరుకుంటారు. ఉదయం 10 గంటలకు గ్రామస్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం జొన్నగిరి మీదుగా గుత్తిలోకి ప్రవేశించనుంది.. గుత్తి శివారులో భోజనవిరామం ఉంటుంది.. మళ్లీ మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి.. పామిడి, కల్లూరు, అనంతపురం బైపాస్, రాప్తాడు బైపాస్, ఆకుతోటపల్లి, సంజీవపురం శివారు వరకు బస్ యాత్ర కొనసాగుతుంది. సంజీవపురం శివారులో రాత్రి బస చేయనున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.