Site icon NTV Telugu

Memantha Siddham: నేడు నంద్యాలలో సీఎం జగన్‌ మేమంతా సిద్ధం బస్సు యాత్ర..

Jagan

Jagan

నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండో రోజు మేమంత సిద్ధం బస్సు యాత్ర నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నైట్ హాల్ట్ ప్రాంతం నుంచి ప్రారంభం కానుంది. ఇవాళ ఉదయం 9 గంటలకు ఆళ్లగడ్డ నుంచి బయలుదేరి నల్లగట్ల, బత్తలూరు, ఎర్రగుంట్ల చేరుకొని గ్రామస్థులతో ముఖాముఖి కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. ఆ తర్వాత గోవిందపల్లి మీదుగా ప్రయాణించి చాబోలు శివారులోని రైతు నగరం వద్ద మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు.

Read Also: MLC Elections: మహబుబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సర్వం సిద్దం..

ఇక, ఆ తర్వాత నూనేపల్లి మీదుగా నంద్యాల చేరుకుని సాయంత్రం 4 గంటలకు గవర్నమెంట్‌ ఆర్ట్స్‌ కాలేజీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రసంగిస్తారు. అనంతరం పాణ్యం, సుగాలిమిట్ట, హుస్సే­నా­పురం, ఓర్వకల్, నన్నూర్, పెద్దటేకూరు, చిన్న కొట్టాల, కె.మార్కాపురం క్రాస్, నాగలాపురంలో ప్రజలతో మమేక­మవుతూ గూడూరు మండలం నాగులాపురంలో సీఎం జగన్ రాత్రికి బస చేయనున్నారు. ఇక, తొలి రోజు ఉమ్మడి జిల్లాలో 5 నియోజకవర్గాల్లో 131 కిలో మీటర్ల మేర జగన్ బస్సు యాత్ర కొనసాగింది.

Exit mobile version