Minister Dharmana Prasada Rao: తెరమీద బొమ్మలు చూడకండి.. నిజ జీవితంలో మార్పు తీసుకువచ్చినవారిని చూడండి.. రియల్ హీరో జగన్ అంటూ సీఎం వైఎస్ జగన్‌పై ప్రశంసలు కురిపించారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.. శ్రీకాకుళం జిల్లాలో వాలంటీర్ సేవలకు పురస్కారాల ప్రదానోత్సవంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ ఎవరికీ అభిప్రాయం చెప్పొద్దని చెప్పలేదు. వాలంటీర్ కూడా మీకు ఇష్టమైన వారికి ఓటు వేయాలని చెప్పే హక్కు ఉంది. ఏ ప్రభుత్వం కన్నీరు తుడిసిందో , ఏ ప్రభుత్వం ఆకలి తీర్చిందో చెప్పాలి అని పిలుపునిచ్చారు. ఇక, ఏ వృద్దుడు ఇతర పార్టీలకు ఓటు వేయరన్న ఆయన.. వృద్ధులకు పోస్టల్ బ్యాలెట్ ఉంది, దానిని వినియోగించమని చెప్పండి. మీరే దగ్గరుండి పోస్టల్ బ్యాలెట్ అప్లై చేయండి అని సూచించారు. వాలంటీర్ కి సర్వీస్ రూల్స్ ఏం లేవు. ఈ ప్రభుత్వం పడిపోయిన రోజున వేలాది మంది గుండేలాగి సచ్చిపోతారంటూ సంచలన వ్యాఖ్యలు చేవారు. అవసరం అయితే వాలంటీర్ ఏజెంట్ గా కూర్చోవలసి ఉంటుందన్నారు ధర్మాన.
ఏరకమైన ప్రతిఫలం ఆశించని వ్యక్తులు వాలంటీర్లు అని అభివర్ణించారు మంత్రి ధర్మాన.. ఏ వృత్తి అయినా పదిమంది గుర్తిస్తేనే సంతృప్తి లభిస్తుందన్నారు. ఎన్నికైన ప్రభుత్వాలు పాలకుడి ఆలోచనకు అనుగుణంగా పాలన ఉంటుందన్నారు సీఎం వైఎస్ జగన్ వయసులో తక్కువ ఉండవచ్చు.. కానీ, పాలనపై క్లారిటీ ఉందని తెలిపారు. చంద్రబాబు కు అవకాశం ఇస్తే ఏం చేశారని నిలదీశారు. గత టీడీపీ పాలనలో రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారు. కలక్టర్లే జన్మభూమి కమిటీకి వెల్లి కలవమని చెప్పేవారంటూ దుయ్యబట్టారు.. జన్మభూమి కమిటీ సభ్యులు స్వతంత్ర సమరయోధులు కాదు.. నీకెంత నాకెంత అనేవారు అంటూ ఆరోపణలు గుప్పించారు. కోపం వస్తే రేషన్ కార్డ్ తీసేసేవారని ఫైర్ అయ్యారు..
ఏసీ గదుల్లోని పులులు.. లోకేష్ ఏం రాస్తే అది చదివేస్తున్నాడు అని ఎద్దేవా చేశారు ధర్మాన.. వాలంటీర్ ఉంటే ఎమ్మెల్యే , మంత్రి ఎవరూ వద్దన్నంత డెప్త్ గా పనిచేశారని వాలంటీర్లపై ప్రశంసలు కురిపించిన ఆయన.. అనేక రుగ్మతలకు వాలంటీర్ ద్వారా పరిష్కారం లభించిందన్నారు. తెరమీద బొమ్మలు చూడకండి , రియల్ జీవితంలో మార్పు తీసుకువచ్చినవారు, రియల్ హీరో జగన్ అని కొనియాడారు.. భాగ్యవంతులు చదుకునే మంచి సిలబస్ ను జగన్ ఐదేళ్లలో అందించారన్న ఆయన.. చంద్రబాబు అబద్దాలు చెబుతున్నాడని ప్రజలు భావిస్తున్నారు.. జగన్ ఎన్నికలలో ఇచ్చిన హామీల నమ్మొద్దని గతంలో చంద్రబాబు చెప్పాడు. పథకాలు ఇవ్వలేరని ప్రచారం చేశారు. కానీ, వైఎస్ జగన్ ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ముందుకు వెళ్తున్నారని వెల్లడించారు.. నేడు మరళా అధికారం ఇస్తే అన్నీ ఇచ్చెస్తాం అంటున్నారు చంద్రబాబు.. అయితే, బీదలు సంతోషంగా ఉండటం ఇష్టం లేని ధనవంతులే పథకాలు తీసేయాలంటున్నారని మండిపడ్డారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.