NTV Telugu Site icon

CM YS Jagan: ఏపీకి భారీ పెట్టుబడులు.. నేడు వర్చువల్‌గా సీఎం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

Ys Jagan

Ys Jagan

CM YS Jagan: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయి.. ఇవాళ సీఎం క్యాంప్‌ కార్యాలయం నుంచి పలు పరిశ్రమలకు వర్చువల్‌గా శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. మొత్తంగా రాష్ట్రంలో రూ.4,178 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసే పలు పరిశ్రమలకు భూమి పూజ ఈ రోజు నిర్వహించనున్నారు.. ఇక, రూ.655 కోట్లతో ఏర్పాటుచేసిన ఆగ్రో ప్రాసెసింగ్‌ యూనిట్లను సీఎం జగన్‌ ప్రారంభించనున్నారు.. రాష్ట్రానికి మొత్తం 10 కంపెనీలకు రూ.4,883 కోట్ల పెట్టుబడులు రానుండగా.. 4,046 మందికి ఉద్యోగాలు కల్పించనున్నారు.

Read Also: Pulwama Terror Attack: పుల్వామా అమర జవాన్లకు ప్రధాని నరేంద్ర మోడీ నివాళులు

సీఎం జగన్‌.. ఈ రోజు పారిశ్రామిక రంగ అభివృద్ధిలో శ్రీకారం చుట్టనున్న సంస్థల విషయానికి వస్తే.. రిలయన్స్‌ బయో ఎనర్జీ, ఆదిత్య బిర్లా గ్రూప్‌తోపాటు పలు సంస్థల ఏర్పాటుకు క్యాంపు కార్యాలయం నుంచి నేడు వర్చువల్‌గా శంకుస్థాపన చేస్తారు సీఎం జగన్‌.. రిలయన్స్‌ బయో ఎనర్జీ రాష్ట్రంలోని 8 ప్రాంతాల్లో వ్యవసాయ వ్యర్ధాల నుంచి బయో గ్యాస్‌ ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది.. దీని కోసం రూ.1,024 కోట్లు పెట్టుబడి పెడుతోంది.. ఈ బయో గ్యాస్‌ ప్లాంట్లు తొలి దశలో కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, కర్నూలు, నెల్లూరులో నెలకొల్పనుంది రిలయన్స్‌. ఇక, రూ.1,700 కోట్ల పెట్టుబడితో తిరుపతి జిల్లా నాయుడుపేటలో మాన్యుఫ్యాక్చరింగ్‌ ఆఫ్‌ కార్బన్‌ బ్లాక్‌ను ఏర్పాటు చేయనుంది ఆదిత్య బిర్లా గ్రూప్‌.. అంతేకాకుండా హెల్లా ఇన్‌ఫ్రా, వెసువియస్‌ ఇండియా లిమిటెడ్, ఏపీఐఐసీ, ఏపీ ఎంఎస్‌ఎంఈ కార్పొరేషన్, అన ఒలియో ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన పలు ప్రాజెక్టులను ఈ రోజు వర్చువల్‌గా శంకుస్థాపనతో పాటు ప్రారంభోత్సవంలో పాల్గొంటారు సీఎం వైఎస్‌ జగన్‌.