NTV Telugu Site icon

YCP Bus Yatra Schedule: సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్ర రూట్ మ్యాప్ ఇదే..!

Ycp

Ycp

YS Jagan Bus Yatra Route Map: సిద్ధం మహా సభలను వైసీపీ ఇప్పటికే నిర్వహించింది అని సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. నాలుగు సభలలో ప్రజలు జగన్ కి నీరజనం పట్టారు.. జగన్ 99 శాతం హామీలను అమలు చేశారు.. నాయకుడు అంటే ఎలా ఉండాలో చూపించారు.. జగన్ బస్సు యాత్ర ఇడుపులపాయ నుంచి ఉత్తరాంధ్ర వరకు నిర్వహిస్తారు.. సిద్ధం సభలతో జాతీయ స్థాయి దృష్టి పడింది.. బూత్ స్థాయిలో కూడా వైసీపీ పార్టీ శ్రేణులు సమాయత్తం అని ప్రకటించారు అని ఆయన చెప్పుకొచ్చారు. ఈ నెల 27 నుంచి వైయస్ జగన్ ఇడుపులపాయ నుంచి బస్సు యాత్ర చేపడుతున్నారు.. కార్యకర్తలను మేమంతా సిద్ధం అని సన్నద్ధం చేయడానికి ఈ బస్సు యాత్ర.. ఏప్రిల్ లో నోటిఫికేషన్ వచ్చే వరకు మేమంతా సిద్ధం యాత్ర కొనసాగుతుంది.. ఆ తరవాత ఎన్నికల ప్రచార సభలు ఉంటాయని సజ్జల వెల్లడించారు.

Read Also: Sita Soren: జేఎంఎంకు సీతా సోరెన్ షాక్.. బీజేపీలో చేరిక

ఈ నెల 27 నుంచి జగన్ జనంలోనే ఉంటారు అని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈ నెల 27వ తేదీన ఉదయం ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు ఆర్పించనున్నారు. ప్రొద్దుటూరులో జగన్ మేమంతా సిద్ధం తొలి బహిరంగ సభ.. ప్రతి రోజు ఉదయం 10 గంటల తర్వాత వివిధ వర్గాలతో జగన్ మాట మంతి ఉంటుంది.. సూచనలు, సలహాలు వైఎస్ జగన్ స్వీకరిస్తారు.. తన విజన్ చెబుతారు అని ఆయన చెప్పుకొచ్చారు. పార్టీ నేతలను ,కార్యకర్తలను కలిసి జగన్ మాట్లాడతారు.. ఆ తరవాత సభ జరిగే అసెంబ్లీ నియోజకవర్గంకు చేరుకుంటారు జగన్.. పాదయాత్ర మాదిరిగా జగన్ ఈ యాత్రను కొనసాగిస్తారు.. 28 నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గం.. అల్లగడ్డ లేదా నంద్యాలలో సభ నిర్వహణ.. అలాగే, ఈ నెల 29న కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని ఎమ్మిగనూరులో సభ ఏర్పాటు చేయబోతున్నామని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.

Show comments