CM YS Jagan: తన సొంత నియోజకవర్గం పులివెందులలో నిర్వహించిన మేమంతా సిద్ధం బహిరంగ సభలో కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం వైఎస్ జగన్.. పులివెందుల సిద్ధమేనా…? అంటూ ప్రశ్నించిన ఆయన.. నా ప్రాణానికి ప్రాణమైన నా సొంత గడ్డ పులివెందుల.. పులివెందుల అంటే నమ్మకం, పులివెందుల అంటే ధైర్యం, పులివెందుల అంటే అభివృద్ధి, పులివెందుల అంటే ఒక సక్సెస్ స్టోరీగా అభివర్ణించారు. పులివెందులలో అభివృద్ధికి మార్పుకు మూలం దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కారణం.. పులివెందులలో ఏముంది అని చెప్పండి అని అడిగితే, ఏమీ లేదో చెప్పండి అని అడిగే పరిస్థితి తీసుకొచ్చా అన్నారు. మాట ఇస్తే మడమ తిప్పమని తెలుగు నేలపై ఆడుగడుగునా నింపింది మీ పులివెందుల బిడ్డే.. రాయలసీమ మంచితనం మాటపై నిలబడే గుండె ధైర్యం చూసి ప్రతి గ్రామంలో వైసీపీని ఆదరిస్తున్నారని తెలిపారు. వైయస్సార్ పైన జగన్ పైన లేనిపోని బురద చల్లడానికి చంద్రబాబు, ఓ దత్తపుత్రుడు, ఓ వదినమ్మ వీరంతా దుర్మార్గంగా ప్రయత్నిస్తున్నారు.. వీరికి తోడు వైయస్సార్ వారసులమని మీ ముందుకు వస్తున్నారు వారి కుట్రలో భాగంగానే.. వైయస్సార్ వారసులని చెప్పాల్సింది ఎవరు ప్రజల కాదా..? అని ప్రశ్నించారు.
Read Also: SRH vs RCB: నువ్ చాలా మంచోడివి ప్యాట్.. కోహ్లీ, కమిన్స్ మధ్య ఆసక్తికర సంభాషణ (వీడియో)!
అన్న గారి మీద కక్షపూరితంగా కుట్రపూరితంగా ఆయన చనిపోయిన తర్వాత ఆయన మీద కేసులు పెట్టింది ఎవరు ? ఆయన పేరును టార్గెట్ చేసింది ఎవరు ? వైయస్సార్ కుటుంబాన్ని అణగదొక్కాలని చూసింది ఎవరు ? అంటూ మండిపడ్డారు సీఎం జగన్.. ఇవన్నీ తెలుగు నేల మీద ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు.. దేశంలో ఉన్న అన్ని వ్యవస్థలను మన మీద ప్రయోగించి వారితోనే ఇప్పుడు కలిసిపోయి అదే కాంగ్రెస్ అదే టీడీపీతో కలిసిపోయి వైఎస్ అనే పేరు కనపడకుండా చేయాలని కోరుకుంటున్నా వారితో కలిసి వీరా వైయస్సార్ వారసులు ? వైఎస్ బ్రతికున్నంత కాలం ఎవరితో పోరాటం చేశారో మీకు తెలుసా..? ప్రతి కార్యకర్త ఎవరితో యుద్ధం చేశారో తెలుసా..? వైయస్సార్ పై కుట్రలు కుతంత్రాలు చేసిన ఆయన శత్రువులతో పసుపు చీర కట్టుకొని వారి ఇళ్లకు వెళ్లి వారికి మోకరిల్లి వారి కుట్రలో భాగమవుతూ.. వారి స్క్రిప్టులను వారు చెప్పినది మక్కికి మక్కి చదివి వినిపిస్తూ కుట్రలో భాగమవుతా ఉన్న వీళ్లు వైయస్సార్ వారసులా? అని విరుచుకుపడ్డారు. వైయస్సార్ కీర్తి ప్రతిష్టలను ప్రజల మనసులో నుంచి తొలగించాలని అందుకోసం గ్రామాలలో ఉన్న వైయస్సార్ విగ్రహాలను ముక్కలు చేస్తామన్న వారితో చేతులు కలిపిన వీరా వైయస్సార్ వారసులు… ఇలాంటి వారికి ఓటు వేస్తే వైయస్సార్ లెగసికి ఓటు వేసినట్లా, ఇలాంటి వారికి ఓటు వేస్తే వైయస్సార్ పేరును కనపడకుండా చేసిన కుట్ర దారులకు ఓటు వేసినట్లా..? అని నిలదీశారు జగన్.