NTV Telugu Site icon

CM YS Jagan: జగన్‌కు వాలంటీర్లు ఒక సైన్యం.. చంద్రబాబుకు కడుపు మంట..

Ys Jagan

Ys Jagan

CM YS Jagan: జగన్‌కు వాలంటీర్లు ఒక సైనం.. కానీ, చంద్రబాబుకు వాళ్లంటేనే కడుపు మంట అంటూ మండిపడ్డారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. విజయవాడలో నిర్వహించిన వాలంటీర్ల సేవా పురస్కారాల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ వారదులు, సంక్షేమ సారథులు ఈ వాలంటీర్లు.. సేవకులు, సైనికులు ఈ వాలంటీర్లు.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్న సైన్యం వాలంటీర్లు.. అవినీతి, రాజకీయం చూడకుండా అందరికీ సంక్షేమం అందిస్తున్నది ఈ వాలంటీర్లు.. జగన్ పెట్టుకున్న నమ్మకం వాలంటీర్ల వ్యవస్థ అంటూ వారి సేవలను కొనియాడారు.. గత ప్రభుత్వ హయాంలో ఈ విధంగా ప్రతి ఇంటికి వెళ్లి ఫించన్ ఇచ్చారా ? అమ్మ ఒడి, ఆసరా, చేయూత, ఇళ్ల పట్టాలు ఇచ్చే పనులు గత ప్రభుత్వంలో ఎప్పుడైనా చూశారా? అంటూ ప్రశ్నించారు.

Read Also: Supreme Court: సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ ప్రశాంత్ మిశ్రా, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ప్రమాణం

గతంలో జన్మభూమి కమిటీ అరాచకాలు, వివక్ష, లంచాల ద్వారానే పథకాల అమలు అయ్యేవని విమర్శించారు సీఎం జగన్‌.. తులసి మొక్క లాంటి వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ అని ప్రశంసించిన ఆయన.. ప్రభుత్వం చేసిన పని ప్రతీ ఒక్కరికీ చెప్పాల్సిన బాధ్యత వాలంటీర్లపై ఉందన్నారు. 3 లక్షల కోట్ల రూపాయలు అక్క చెల్లెళ్ళకు ఇచ్చామని గుర్తిచేశరాఉ. కానీ, అన్యాయమైన రాజకీయాల మధ్య మనం ఉన్నాం.. పేదల ప్రభుత్వంపై అసత్య ప్రచారాలను కొన్ని మీడియాల్లో, సోషల్ మీడియా ద్వారా చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం చేసిన మంచి ప్రతి గడపకు వెళ్లి చెప్పే వాలంటీర్లు మనకి అండగా ఉన్నారు.. ప్రభుత్వానికి చేసే సేవ చేస్తున్నారు ఈ వాలంటీర్లు.. సేవ చేసే వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కాదు.. కేవలం సేవ చేయాలని తపన ఉన్న వారే ఈ వాలంటీర్లు అని పేర్కొన్నారు. వాలంటీర్ల వ్యవస్థకు అడ్డంకి ఎప్పటికీ ఉండదని స్పష్టం చేసిన సీఎం వైఎస్‌ జగన్‌.. మంచి చేస్తున్న ప్రభుత్వానికి వాలంటీర్లు బ్రాండ్ అంబాసిడర్లుగా అభివర్ణించారు.

Read Also: Charan NTR: జపాన్‌లో జెండా పాతిన చరణ్‌, ఎన్టీఆర్!

ఏ పార్టీ వ్యక్తి అయినా ప్రభుత్వ పథకం అందాలి.. చంద్రబాబుకి వాలంటీర్ల వ్యవస్థ అంటే కడుపు మంట అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం జగన్‌.. 10 జెలేసిన్ మాత్రలు వేసుకున్నా చంద్రబాబుకి కడుపు మంట తగ్గదు అంటూ ఎద్దేవా చేసిన ఆయన.. వాలంటీర్లకు దురుద్దేశాలు ఆపాదిస్తున్నారని ఫైర్‌ అయ్యారు.. వాలంటీర్ల వ్యవస్థను అడ్డుకునే విధంగా అన్ని ప్రయత్నాలు చేశారు.. టీడీపీ అధికారంలోకి వస్తే తమ వారిని జన్మ భూమి కమిటీలు తెస్తామని చంద్రబాబు అంటున్నారన్నారు. జగన్ కు వాలంటీర్లు ఒక సైన్యం.. వాలంటీర్లు గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి తేడా ప్రజలకు చెప్పాలని పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.

Show comments