NTV Telugu Site icon

CM Revanth Reddy: నీటిపారుదల శాఖపై సీఎం రేవంత్ రివ్యూ..

Cm Revanth Reddy

Cm Revanth Reddy

సచివాలయంలో నీటిపారుదల శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష చేపట్టారు. ఈ సమావేశానికి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి, సంబంధిత శాఖ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రాజెక్టులవారీగా ఆయకట్టు వివరాలలో కొంత గందరగోళం ఉందని అధికారులకు తెలిపారు. గ్రామాలు, మండలాల వారీగా ప్రాజెక్టుల ఆయకట్టు వివరాలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఈ క్రమంలో.. పెండింగ్ ప్రాజెక్టుల వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. ప్రాధాన్యతల వారీగా పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.

Read Also: Breaking News: సంగారెడ్డి జిల్లాలో పలు చోట్ల భూకంపం.. 5 సెకన్లు కంపించిన భూమి

ఈ సందర్భంగా.. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. కల్వకుర్తి ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ ఎందుకు ముందుకు సాగడం లేదని సీఎం అధికారులను ప్రశ్నించారు. నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని తెలిపారు. వీలైనంత త్వరగా ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం ఇచ్చారు. మొదటి ప్రాధాన్యతగా తీసుకుని ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తే 4లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించవచ్చన్నారు. కొన్ని ప్రాజెక్టులను గ్రీన్ ఛానెల్ ద్వారా వేగంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందని సీఎం తెలిపారు.

Read Also: CM Revanth: ఆ లబ్ధిదారులకు తులం బంగారం అందించేందుకు ప్రణాళికలు రూపొందించాలి..