Site icon NTV Telugu

CM Revanth Reddy: జపాన్ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి.. పూర్తి షెడ్యూల్ ఇదే

Revanth Reddy

Revanth Reddy

ఈ రోజు రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన కు బయల్దేరనున్నారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, రాష్ట్ర అధికారుల ప్రతినిధి బృందం సీఎం వెంట వెళ్లనున్నారు. ఏప్రిల్ 16 నుంచి 22 వరకు తెలంగాణ ప్రతినిధుల బృందం జపాన్‌ లో పర్యటించనుంది. టోక్యో, మౌంట్ ఫుజి, ఓసాకా, హీరోషిమా లో ముఖ్యమంత్రి బృందం పర్యటించనుంది. ఓసాకా వరల్డ్ ఎక్స్పో 2025లో తెలంగాణ పెవిలియన్ ను ప్రారంభిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆ దేశానికి చెందిన ప్రముఖ కంపెనీలు, పారిశ్రామిక వేత్తలు, పలువురు ప్రతినిధులతో ముఖ్యమంత్రి బృందం సమావేశమవుతుంది. రాష్ట్రంలో పెట్టుబడులు, పారిశ్రామిక సాంకేతిక సహకారంపై ప్రధానంగా చర్చలు జరుపనున్నారు.

Also Read:IND vs BAN: బంగ్లాదేశ్ లో టీమిండియా పర్యటన.. షెడ్యూల్ రిలీజ్ చేసిన బీసీసీఐ

■ జపాన్ పర్యటన షెడ్యూల్ (16 – 22 ఏప్రిల్ 2025)

మంగళవారం రాత్రి బెంగుళూరు ఎయిర్‌పోర్టు నుంచి ముఖ్యమంత్రితో పాటు అధికారులు జపాన్ కు బయల్దేరుతారు

■ 16 ఏప్రిల్ (బుధవారం) – టోక్యో

• జపాన్ చేరుకుంటారు (నారిటా ఎయిర్‌పోర్ట్)

• భారత రాయబారి తో ఆతిథ్య భేటీ.

■ 17 ఏప్రిల్ (గురువారం) – టోక్యో

• ఉదయం నుంచి మద్యాహ్నం వరకు సోనీ గ్రూప్, జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ, JETRO, జపాన్ బయో ఇండస్ట్రీ అసోసియేషన్‌, వివిధ సంస్థలతో సమావేశాలు

• సాయంత్రం తోషిబా ఫ్యాక్టరీ సందర్శన

■ 18 ఏప్రిల్ (శుక్రవారం) – టోక్యో

• గాంధీ విగ్రహానికి పుష్పాంజలి

• టోక్యో గవర్నర్ గారితో మర్యాదపూర్వక సమావేశం

• ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో ఇండస్ట్రీ ప్రతినిధుల భేటీ

• టయోటా, తోసిబా, ఐసిన్, ఎన్టీటీ తదితర కంపెనీల సీఈవోలతో వేర్వేరుగా సమావేశాలు

• జపాన్ ఓవర్సీస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ కార్పొరేషన్ ఫర్ ట్రాన్సఫోర్ట్ అండ్ అర్బన్ డెవెలప్మెంట్ ప్రతినిధులతో సమావేశం

• సుమిదా రివర్ ఫ్రంట్ సందర్శన

■ 19 ఏప్రిల్ (శనివారం) – టోక్యో నుంచి → ఒసాకా

• మౌంట్ ఫుజి ప్రాంత సందర్శన

• అరకురయామా పార్క్‌ సందర్శన

■ 20 ఏప్రిల్ (ఆదివారం) – కిటాక్యూషు సిటీ → ఒసాకా

• కిటాక్యూషు మేయర్ గారితో సమావేశం

• ఎకో టౌన్ ప్రాజెక్టుకు సంబంధించిన సమావేశం

• మురసాకి రివర్ మ్యూజియం సందర్శన

• ఎన్విరాన్‌మెంట్ మ్యూజియం & ఎకో టౌన్ సెంటర్ సందర్శన

■ 21 ఏప్రిల్ (సోమవారం) – ఒసాకా

• యుమెషిమాలో వరల్డ్ ఎక్స్ఫో.. తెలంగాణ పెవిలియన్ ప్రారంభం

• బిజినెస్ రౌండ్‌టేబుల్ సమావేశం

• ఒసాకా రివర్ ఫ్రంట్ సందర్శన

22 ఏప్రిల్ (మంగళవారం) – ఒసాకా → హిరోషిమా

• హిరోషిమా పీస్ మెమోరియల్ సందర్శన, గాంధీ విగ్రహానికి పుష్పాంజలి

• హిరోషిమా వైస్ గవర్నర్ మరియు అసెంబ్లీ చైర్మన్‌తో సమావేశాలు

• హిరోషిమా జపాన్‌‌–ఇండియా చాప్టర్ తో బిజినెస్ లంచ్

• హిరోషిమా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సందర్శన

• మజ్డా మోటార్స్ ఫ్యాక్టరీ సందర్శన

■ అనంతరం ఒసాకాలోని కాన్సాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి బయల్దేరుతారు.

23న ఉదయం హైదరాబాద్‌కు చేరుకుంటారు.

Exit mobile version