సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం జరిగింది. అయితే.. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వీని ప్రతిపాదించిన వెంటనే ఆమోదించినందుకు అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర పునర్విభజన చట్టం అమలులో అనేక రాజ్యాంగ, న్యాయపరమైన చిక్కులు, అవాంతరాలు ఉత్పన్నమయ్యాయన్నారు. 2014 పునర్విభజన చట్టాన్ని పదేళ్లపాటు కేంద్రం అమలు చేయలేదని, పునర్విభజన చట్టంలోని అంశాలను చట్టసభలతోపాటు సుప్రీంకోర్టులో బలంగా వాదన వినిపించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అందుకే రాజ్యాంగ, న్యాయ కోవిదుడు అభిషేక్ మను సింఘ్వీని తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపాలని అధిష్టానాన్ని కోరామని ఆయన తెలిపారు.
Rishabh Pant: రిషబ్ పంత్లో ఈ కళ కూడా ఉందా.. వీడియో వైరల్
అపరిష్కృతమైన సమస్యల పరిష్కారం కోసం చట్టసభల్లో న్యాయస్థానాల్లో అభిషేక్ మను సింఘ్వీ గట్టిగా వాదిస్తారని, మాజీ ఎంపీ కేకే పెద్దమనసుతో క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ కార్యకర్తగా వ్యవహరించారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మాజీ మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ నియోజక వర్గాల్లోనూ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి తక్కువ ఓట్లు వచ్చాయని అన్నారు. తాము ప్రచారం చేయకపోయినా 2018లో కాంగ్రెస్ పార్టీకి సీట్లు వచ్చాయని, బీఆర్ఎస్ పార్టీకీ ఇప్పుడు ఒక్కటీ రాలేదని చెప్పారు. కాగా, రేపు ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వీ నామినేషన్ దాఖలు చేయనున్నారు.
Suryakumar Yadav: కోల్‌కతా రేప్ ఘటనపై సూర్యకుమార్ ఇన్స్టాలో పోస్ట్.. వైరల్
