Site icon NTV Telugu

CM Revanth Reddy: మత ప్రాతిపదికన రిజర్వేషన్లపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు..

Cm Revanth Reddy

Cm Revanth Reddy

తెలంగాణ ప్రభుత్వం పంపిన రిజర్వేషన్ల బిల్ ఆమోదించకుండా ఆలస్యం చేస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. విద్య ఉపాధి అంశాలతో పాటు, స్థానిక సంస్థల రిజర్వేషన్ల రెండు బిల్లులను ఆమోదించడం లేదన్నారు. నేడు ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు లేవని.. మతాలు ప్రాతిపదిక కాదన్నారు. వెనుకబాటు తనమే తమ ప్రాతిపదిక అని స్పష్టం చేశారు. రేపు ఉదయం మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలను కలుస్తామని తెలిపారు.. సర్వే వివరాలు వివరిస్తామని స్పష్టం చేశారు. తమ తరఫున పార్లమెంట్ లో ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరతమన్నారు. రేపు సర్వే కోసం జరిగిన ప్రక్రియ పై కాంగ్రెస్ ఎంపీలకు వివరిస్తామని వెల్లడించారు. జనగణనలో కుల గణన చేర్చాలని.. జనగణనలో కులగణన ఎలా చేయొచ్చు.. దేశానికి తెలంగాణ మోడల్ గా నిలిచిందో వివరిస్తామన్నారు. తాము చేసిన సర్వే దేశానికి రోల్ మోడల్ అని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి తమ కార్యాచరణ సిద్ధం చేశామని వెల్లడించారు. కేంద్రం రిజర్వేషన్లను ఆమోదించాలని.. అందుకే కేంద్రం పై ఒత్తిడి తేవాలన్నారు. అవసరం అయితే కూటమి నేతలను కూడా కలుస్తామని చెప్పారు.

READ MORE: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్.. సుప్రీంకోర్టుకు ప్రభాకర్‌రావు

సోషల్ జస్టిస్ కు అందరూ సహకరించాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. “గుజరాత్, యూపీ, మహారాష్ట్రలో ముస్లింలకు రిజర్వేషన్లు ఉన్నాయి. అక్కడ ముస్లిం రిజర్వేషన్లు తొలగించి బీజేపీ నేతలు తెలంగాణ గురించి మాట్లాడాలి. బీజేపీ నేతలు వితండ వాదం చేస్తున్నారు. ఒక ఇంటర్వ్యూలో ముస్లిం రిజర్వేషన్లు అమలు చేస్తాం అని అమిత్ షా అన్నారు. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా..? కేంద్రం తక్షణమే బిల్లును ఆమోదించాలి. సర్వేను శాసన సభలో ప్రవేశ పెట్టి పూర్తి స్థాయిలో చర్చకు అవకాశం ఇచ్చాం. వ్యక్తుల వ్యక్తిగత వివరాలను బహిరంగ పరచలేదు. 3.9 శాతం ప్రజలు తమకు ఏ కులం లేదని డిక్లేర్ చేశారు. ఎక్స్పర్ట్స్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ను రోడ్ పై పెట్టలేం. ఫస్ట్ క్యాబినెట్ ముందు పెట్టాలి. శాసన సభలో ప్రశ్నిస్తే.. సమాధానం చెప్తాం. అడిగిన వివరాలు ఇస్తాం. పబ్లిక్ డొమైన్ లో పెట్టేటప్పుడు.. అన్ని న్యాయపరమైన అంశాలను పరిశీలిస్తాం. క్యాబినెట్‌లో చర్చించి, శాసన సభలో ప్రవేశ పెడతాం. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు లేవు. మతాలు ప్రాతిపదిక కాదు. వెనుకబాటు తనమే మా ప్రాతిపదిక. బీజేపీ తొండి వాదన చేస్తోంది. తమ దగ్గర రీసెర్చ్ అండ్ అనాలసిస్ వివరాలు ఉన్నాయి. కేంద్రం బిల్లును ఆమోదించకపోతే, ఒత్తిడి తెచ్చేందుకు మా వ్యూహం మాకుంది.” అని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

READ MORE: Minister Vasamsetti Subhash: దళిత యువకుడిపై దాడి ఘటనపై స్పందించిన మంత్రి సుభాష్‌..

Exit mobile version