Site icon NTV Telugu

CM Revanth Reddy: 2040 వరకు క్రియాశీలక రాజకీయాల్లో ఉంటా.. రేవంత్ కీలక వ్యాఖ్యలు..

7

7

CM Revanth Reddy: 2040 వరకు క్రియాశీలక రాజకీయాల్లో ఉంటానని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కళ్యాణ్‌నగర్ టీజీ జెన్కో ఆడిటోరియంలో ప్రముఖ కవి అందేశ్రీ రచించిన హసిత భాష్పాలు పుస్తకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సమాజం కవులకు, పోరాటానికి స్ఫూర్తినిచ్చిన గడ్డ అని అన్నారు. ఉద్యమంలో ప్రజలకు స్ఫూర్తిగా గూడ అంజన్న, దశరథి, కాళోజీ, అందెశ్రీ, గద్దర్, గోరెటి వెంకన్న లాంటి కవులు నిలిచారని గుర్తు చేశారు. తనపై తనకు సంపూర్ణ నమ్మకం కలిగించి, కార్యోన్ముకిన్ని చేసి యుద్ధ రంగానికి సిద్ధం చేసిన వ్యక్తి శ్రీకృష్ణుడు అని అన్నారు. తాను కొంచెం ఓపెన్‌గా మాట్లాడుతానని, ఎక్కువ టైమ్ రాజకీయ కార్యక్రమాలకు ఇస్తానని, ఎందుకుంటే అక్కడ తాము మాట్లాడేదే ఫైనల్ ఉంటుందని అన్నారు. కానీ ఈ పుస్తకావిష్కరణలకు రావాలంటే పదంపదం ప్రిపేర్ అయ్యి రావాలని అన్నారు. అసలైన ఉద్యమకారులు ఎవరు కూడా తాము ఉద్యమకారుణ్ణి అని చెప్పుకోలేదని, కొద్ది మంది ఉద్యమకారులని చెప్పుకునే వాళ్లకి టీవీలు, పేపర్లు, వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో తనకు అర్థం కావడం లేదన్నారు.

READ MORE: EC Press Conference: రేపు ఈసీ ప్రెస్మీట్.. బీహార్ ఓటర్ లిస్ట్, రాహుల్ ఆరోపణలపై రియాక్షన్!

కొందరు గాలికి అనుకూలంగా ప్రణాళికలు వేసుకుని, దేశానికి నాయకత్వం వహించాలనే దురాశతో తెలంగాణ పేరు, పేగు బంధాన్ని తెంచుకున్నారని అన్నారు. తాను ఎవరిని కూడా శత్రువుగా చూడనని, తాను శత్రువుగా చూడాలంటే వాళ్లకు స్థాయి ఉండాలని అన్నారు. Zptc నుంచి ఈ స్థాయికి వచ్చానని, ఇంత గొప్ప అవకాశాన్ని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఇచ్చారని అన్నారు. ఇలాంటి గొప్ప అవకాశాన్ని, తనకు వాళ్ల మీద ప్రయోగిస్తే తనకంటే మూర్ఖుడు మరోకరు ఉండరని అన్నారు. తాను కర్మసిద్ధాంతాన్ని నమ్ముతానని, వాళ్ల పాపాన వాళ్లేపోతారని భావిస్తానన్నారు. తన గెలుపేతో గిట్టని వాళ్లకు దుఃఖం వచ్చిందని, తాను సంతకం పెడుతుంటే వాళ్లకు గుండెల్లో రాసినట్టు అయ్యిందని అన్నారు. అందాల పోటీల్లప్పుడు 109 దేశాల సుందరీమణులతో జయ జయహే తెలంగాణ పాటను పాడించామని, వాళ్లను తెలంగాణ తల్లి ముందు మొకరించామని అన్నారు. కట్టడాలు ఎవరైనా కట్టొచ్చని, అందమైన భవనాలు అభివృద్ధి కాదని, పేదలకు సొంత ఇళ్లు ఇచ్చి ఆత్మగౌరవం నిలబెడుతున్నామని అన్నారు. ఒకనాడు సీఎంను చూడాలంటే గొప్ప సన్నివేశం. కానీ ఇప్పుడు ఎప్పుడైనా, ఎవరైనా కలవచ్చని అన్నారు. తాను zptc అయినప్పుడు కౌన్సిల్ లేదని, జడ్పీటీసీ కాగానే కౌన్సిల్ వచ్చిందని, తర్వాత ఎమ్మెల్సీ అయ్యానని, తెలంగాణకి రెండో సీఎం అయ్యానని అన్నారు. 2040 వరకు క్రియాశీలక రాజకీయాల్లో ఉంటానని సీఎం అన్నారు.

READ MORE: Karimnagar: కోతుల బెడదకు రైతు ఇన్నోవేటివ్ ఐడియా.. పంటను కాపాడిన ప్రత్యేక పరికరం!

Exit mobile version