తెలంగాణ రాజ్ భవన్ లో గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసైకి రేవంత్ రెడ్డి, శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు సీతక్క, కొండా సురేఖతో పాటు పలువురు అధికారులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళ సై మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
Read Also: Tragedy: కొత్త సంవత్సరం వేళ విషాదం.. ఒకే ఇంట్లో ఐదుగురు ఆత్మహత్య
ఈరోజు సుమారు 3, 500 మందిని కలిశాను అని గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ తెలిపారు. 4 గంటల పాటు పబ్లిక్ కి అందుబాటులో ఉన్నాను.. బొకేలు వద్దు బుక్స్, నోట్స్ ఇవ్వమని నా సూచన చాలా మంది రాజ్ భవన్ కి వచ్చి బుక్స్ ఇచ్చారు.. అందరికి ధన్యవాదాలు.. తెలంగాణ ప్రజల ప్రేమ ఆప్యాయత మరువలెను అని ఆమె పేర్కొన్నారు. ఈ రోజు గవర్నర్ పేరుతో వాట్సప్ ఛానెల్ ను లాంఛ్ చేసాను.. రాజ్ భవన్ కి సంబంధించి అన్ని అప్ డేట్స్ ఈ ఛానెల్ లో ఉంటాయని తమిళ సై వెల్లడించారు. తెలంగాణ ప్రజలు ఈ సంవత్సరం ప్రతి పనిలో విజయం సాధించాలని ఆమె సూచించారు.