NTV Telugu Site icon

CM Revanth: శిల్పారామం పక్కన నిరుపయోగంగా ఉన్న స్టాల్స్ ను పరిశీలించిన సీఎం..

Revanth

Revanth

హైదరాబాద్ శిల్పారామం పక్కన నిరుపయోగంగా ఉన్న స్టాల్స్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. మహిళా శక్తి పథకంలో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళల ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం అధికారులకు ఆదేశాలిచ్చారు. 2017 నుంచి నిరుపయోగంగా ఉన్న నైట్ బజార్ లోని 119 స్టాల్స్ ను ఇందుకు ఉపయోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతు బజార్ లా స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకునేలా స్టాల్స్ ను తీర్చి దిద్దాలని అధికారులకు దిశానిర్ధేశం చేశారు ముఖ్యమంత్రి.

Read Also: Petrol: ఎన్నికల వేళ వాహనదారులకు గుడ్‌న్యూస్!

పూర్తిగా మహిళలకు మాత్రమే స్టాల్స్ ను కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలతో ఉత్తర్వులను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వీలైనంత త్వరగా ఉత్తర్వులను జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం అన్నారు. అందుకోసం.. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో ముందుకెళ్లాలని ఆదేశం ఇచ్చారు. అవసరమైతే మణికొండలోని మహిళలకు కేటాయించిన మార్కెట్ ను అధ్యయనం అధికారులకు సూచించారు. మహిళా శక్తి పథకంలో భాగంగా కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

Read Also: Andhra Pradesh: రాష్ట్రంలోని 2 జిల్లాల్లో స్వల్పంగా కంపించిన భూమి