CM Revanth Reddy: హైదరాబాద్ నగరంలోని 83వ ఆలిండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నుమాయిష్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ ఎగ్జిబిషన్ లో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 2, 400 స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. ఇవాళ్టి నుంచి ఫిబ్రవరి 15 వరకు 45 రోజుల పాటు ఈ ఎగ్జిబిషన్ జరగనుంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కశ్మీర్ తివాచీల నుంచి కన్యాకుమారిలో దొరికే అన్ని వస్తువులు నుమాయిష్ లో దొరుకుతాయి.. దేశాన్నే ఆకర్షించే నుమాయిష్ హైదరాబాద్ ఉండడం మన గర్వకారణం అని ఆయన చెప్పుకొచ్చారు. దేశంలో హైదరాబాద్ ను గుర్తు తెచ్చుకుంటే నుమయిష్ గుర్తు వస్తుంది.. హైటెక్స్ లాంటి ఏక్సిబిషన్ లు వచ్చినా నాంపల్లి నుమాయిష్ కళ తగ్గలేదు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
Read Also: BJP Meeting: రామమందిర శంకుస్థాపన ఏర్పాట్లపై రేపు బీజేపీ సమావేశం
గత పది సంవత్సరాల నుంచి పేరుకుపోయిన సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తాము అని సీఎం తెలిపారు. ఏక్సిబిషన్ సొసైటీలో మహిళా సోదరీమణులు ఉండడం సంతోషంగా ఉందని చెప్పారు. మీ సమస్యలు ఏమి ఉన్నా ఈ ప్రభుత్వం పరిష్కరిస్తుంది.. నేను గతంలో రెగులర్ గా ఈ నుమయిష్ కు వచ్చే వాడిని అని చెప్పారు. రాజకీయాల్లో బిజీ అయిన తరువాత రావడం తగ్గించాను అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.