NTV Telugu Site icon

Revanth Reddy : డి శ్రీనివాస్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి రేవంత్..

Revanth

Revanth

Revanth Reddy : ఆదివారం నాడు నిజామాబాద్ లో మాజీ మంత్రి, పీసీసీ మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ భౌతికకాయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. ఆయనతో పాటు మంత్రి పొంగులేటి, షబ్బీర్ అలీ, మహేష్ కుమార్ గౌడ్ లు పాల్గొన్నారు. ఇందులో భాగంగా రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ క్రమశిక్షణ కార్యకర్త డి.ఎస్. అని ఆయన అన్నారు. గాంధీ కుటుంబాలకు అంతరంగికుడని., తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ లో ఎవరు మరచిపోలేని పాత్ర పోషించారని సీఎం అన్నారు. 2004 లో పీసీసీ అధ్యక్షుని హోదా లో తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకతను సోనియాకు ఆయన చెప్పారని ఆయన అన్నారు. రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో రావడానికి డి.ఎస్. ఆలోచన విధానం ఎంతో ఉపయోగపడిందని ఆయన అన్నారు.

Rain Alert: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. మూడు రోజుల పాటు భారీ వర్షాలు..

నిజామాబాద్ లో నేడు డి.శ్రీనివాస్ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో పూర్తి చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసారు అధికారులు. నిజామాబాద్ నగరంలోని ఆయన నివాసం ప్రగతి నగర్ నుంచి అంతిమ యాత్ర మొదలు కానుంది. బైపాస్ రోడ్డులోని డి.ఎస్. సొంత స్థలంలో అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ సందర్బంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు హాజరు అయ్యారు. ఇక శ్రీనివాస్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన తర్వాత సీఎం రేవంత్ తిరిగి హైదరాబాద్లోని తన నివాసానికి చేరుకోనున్నారు.

Minister Seethakka: కాగజ్ నగర్ లో మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు..