Site icon NTV Telugu

CM Revanth Reddy: అందుకే నెలకు మూడు సార్లు కేంద్రం, మోడీని కలుస్తున్నా.. సీఎం కీలక వ్యాఖ్యలు..

CM Revanth Reddy: ఆదిలాబాద్ జిల్లా అంటే తనకు ఎంతో ప్రత్యేకమని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ కు జరగాల్సిన న్యాయం, చేయాల్సిన అభివృద్ధి జరగలేదన్నారు. పాలమూరు తో సమానంగా ఆదిలాబాద్ జిల్లా కు నిధులు ఇస్తున్నామని చెప్పారు. తాజాగా నిర్మల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. భూసేకరణ కు నిధులు మంజూరు చేసి ప్రాజెక్టులు పూర్తి చేసుకున్నామని తెలిపారు. ఉమ్మడి జిల్లాకు వర్శిటీ లేదని.. ఈ ప్రాంతానికి వర్సిటీ మంజూరు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. త్వరలో వర్సిటీ మంజూరు అవుతుందన్నారు. బాసర వర్సిటీ ఏర్పాటు చేసుకుంటున్నామని.. దానికి ఏర్పాట్లు చేయాలన్నారు. ఆదిలాబాద్ వర్సిటీ బాసరలో ఏర్పాటు చేస్తున్నామని.. ఉమ్మడి జిల్లా కు కావాల్సిన నిధులను బడ్జెట్ లో ప్రవేశ పెట్టుతామన్నారు.. తుమ్మడి హెట్టీ వద్ద ప్రాణహిత చేవెళ్ల పై నివేదిక తయారు చేస్తున్నామని.. తుమ్మడి హెట్టీ వద్ద ప్రాజెక్టు కట్టి తీరుతామని స్పష్టం చేశారు. ప్రతి నీటి చుక్కని ఓడి పట్టుతామన్నారు.. ఆదిలాబాద్‌కు ఎయిర్ పోర్ట్ తీసుకొచ్చే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. మోడీ చేతుల మీదుగా ఆదిలాబాద్ ఎయిర్ పోర్టు శిలాఫలకం వేయిస్తామని స్పష్టం చేశారు. ఎన్నికలు వచ్చాక రాజకీయం.. ఎన్నికల తర్వాత అభివృద్ధికి కలిసి నడుద్దామన్నారు. ప్రతి మూడు నెలలకు సారి కేంద్రాన్ని కలుస్తాం.. మీరు సైతం నా దగ్గరకు రండి.. సాధ్యం అయినంత పనులు చేస్తామని ప్రతిపక్ష నేతలకు సీఎం తెలిపారు. మోడీ నాకు చుట్టం కాదు దేశానికి ప్రధాని కాబట్టి మన ప్రాంతం అభివృద్ధి కావాలి కాబట్టి మోడీని కలుస్తున్నానని చెప్పారు. ప్రాంత అభివృద్ధి కోసం ఎవ్వైర్నినా కలుస్తా. పైరవీలు లేవు, పర్సనల్ పనులు నాకు లేవని సీఎం స్పష్టం చేశారు.

READ MORE: MSVG : 4 రోజులు.. 200 కోట్లు.. మెగా మాస్ ఆన్ డ్యూటీ!

కేంద్రం వరంగల్ ఎయిర్ పోర్టు వచ్చింది. ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ ఇస్తాం అని చెప్పినట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. “ఇవ్వన్నీ అడిగనిదే ఇవ్వరు. గత పాలకులు అడగకపోవడంతో ఈ పరిస్థితి వచ్చింది. వాళ్ల తప్పులకు ఇప్పుడు అప్పులు మిగిలాయి. ఆ ప్రభుత్వంలో ఇచ్చిన బియ్యం ఎవ్వరైనా తిన్నారా..? కాని మేము ఇచ్చే సన్న బియ్యం తింటున్నారు. నాడు పావలా వడ్డీ లేదు సున్నా వడ్డీ లేదు.. గుండు సున్నా మిగిల్చారు. వెయ్యికోట్ల భూమి మహిళలకు కేటాయించాం.. ఒక అంబాసిడర్ కారు షెడ్డుకు పోయింది. నిర్మల్‌కు ATC మంజూరు చేస్తున్నాం.. నాగోబా జాతరకు రూ. 22 కోట్లు మంజూరు చేస్తాం. సమ్మక్క సారలమ్మ మందిరాన్ని తీర్చి దిద్దుతున్నాం. ఈనెల 18 న మేడారంలో ప్రారంభిస్తాం. ప్రపంచ పెట్టుబడుల స్వర్గధామంగా హైదరాబాదును మార్చాం.. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక స్థితి వల్ల క్రమక్రమంగా అభివృద్ధి చేసుకుందాం.. రాష్ట్ర ప్రజలు అండగా నిలవండి, దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతా.. త్వరలో మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి… ప్రజా ప్రభుత్వంతో కలిసి పని చేసే వారిని గెలిపించండి.. కేవలం ఎన్నికల అప్పుడే రాజకీయాలు, అభివృద్ధికి అందరం ఒకటే..” అని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

Exit mobile version