Site icon NTV Telugu

CM Revanth Reddy: కేంద్రం చర్యలకు మద్దతుగా నిలబడాలి.. తీవ్రవాదాన్ని అంతమొందించాలి

Cm Revanth

Cm Revanth

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ ముక్తకంఠంతో నినదిస్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పాక్ పై దౌత్యపరమైన దాడికి తెరలేపింది. దేశం మొత్తం పాక్ కు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తోంది. ముష్కరుల దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్గౌడ్, ఒవైసీ, మంత్రులు పాల్గొన్నారు. పీపుల్స్ ప్లాజా నుంచి నెక్లెస్ రోడ్, ఇందిరా గాంధీ విగ్రహం వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు..

Also Read:CSK vs SRH: పాయింట్స్ పట్టికలో చివరి స్థానంలో నిలిచేదెవరో.. మొదట బ్యాటింగ్ చేయనున్న సీఎస్‌కే

ఉగ్రదాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు.. ర్యాలీలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నాయి.. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. పర్యాటకులపై దాడి చేసి చంపడం తీవ్రమైన ఘటన.. అందరం ఒక్కటై తీవ్రవాదంపై పోరాడాలి.. భారత ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యకు మద్దతు ఇవ్వాల్సిన సమయం ఇది.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి.. దాడులకు పాల్పడిన వారికి తగిన బుద్ధి చెప్పాలి.. పార్టీలకు అతీతంగా పని చేయాలి.. తీవ్రవాదాన్ని అంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

Exit mobile version