Site icon NTV Telugu

CM Revanth: త‌మిళ‌నాడులోని సీఎం బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమం హృద‌యాన్ని తాకుతుంది.. తెలంగాణ‌లో కూడా ప్రారంభిస్తాం..

Cm Revanth

Cm Revanth

చెన్నై జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో విద్యలో ముందంజ‌లో త‌మిళ‌నాడు కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంత మంచి కార్యక్రమానికి న‌న్ను ఆహ్వానించినందుకు సంతోషంగా ఉంది. అన్నాదొరై, క‌రుణానిధి, కామ‌రాజ్ వంటి గొప్ప యోధుల జ‌న్మస్థలం త‌మిళ‌నాడు అని అన్నారు. క‌రుణానిధి విజ‌న్‌ను అమ‌లు చేస్తున్న స్టాలిన్, ఉద‌య‌నిధిల‌ను అభినందిస్తున్నానని తెలిపారు. ఇందిరాగాంధీ కామ‌రాజ్ ప్లాన్‌ను తీసుకువ‌చ్చారు.. కామ‌రాజ్ త‌మిళ‌నాడులో తీసుకువ‌చ్చిన‌ విద్యా విధానాన్ని దేశం అనుస‌రిస్తోంది.. ఈ కార్యక్రమం తమిళనాడు యువతకు ఎంతో స్ఫూర్తి దాయకంగా ఉంటుంది.. త‌మిళ‌నాడు అవలంభిస్తున్న సీఎం బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమం హృద‌యాన్ని తాకుతుంది.. తెలంగాణ‌లోనూ ఈ స్కీమ్‌ను వ‌చ్చే ఏడాది నుంచి తెలంగాణ‌లో ప్రారంభిస్తామ‌ని ప్రకటించారు.

Also Read:TGSRTC Lucky Draw: గుడ్ న్యూస్.. ఆర్టీసీ బస్సెక్కితే బహుమతులు.. రూ.5.50 లక్షల విలువగల బహుమతులు గెలుచుకునే ఛాన్స్

నాన్ ముద‌ల‌వ‌న్ (స్కిల్ డ‌వెల‌ప్‌మెంట్) రూ.10 వేల ఉపకార వేత‌నం ప్రభుత్వ క‌ళాశాల‌ల‌కు వెళ్లే బాలురు, బాలిక‌ల‌కు ఇచ్చే ఈ స్కీమ్‌లు ఉండ‌డం అదృష్టం.. త‌మిళ‌నాడు పేద‌ల‌కు అండ‌గా సీఎం స్టాలిన్ ఉన్నారు.. ఎన్నో శతాబ్దాల నుంచి తమిళ, తెలుగు రాష్ట్రాలు, ప్రజల మధ్య సాంస్కృతిక, చారిత్రకపరమైన బలమైన సంబంధం ఉంది.. 1991 స‌ర‌ళీక‌ర‌ణ త‌ర్వాత సరళీకృత ఆర్థిక విధానాలతో తమిళనాడులో మ్యాన్యుఫ్యాక్చరింగ్ రంగం అభివృద్ధి చెందింది..తెలంగాణలో ఐటీ, ఫార్మా రంగాలు అభివృద్ధి చెందాయి.. సామాజిక న్యాయం అమ‌లులో త‌మిళ‌నాడు-తెలంగాణ మ‌ధ్య సారూప్యత‌లున్నాయన్నారు.

మేం క‌రుణానిధిని స్ఫూర్తిగా తీసుకున్నాం.. మా రాష్ట్రంలో త్వరలో జ‌రిగే స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లో ఓబీసీల‌కు 42 శాతం, 27 శాతం ఎస్సీ, ఎస్టీల‌కు, మొత్తంగా 69 శాతం రిజ‌ర్వేష‌న్లు ఇవ్వబోతున్నాం.. భార‌తీయులంతా త‌మిళ‌నాడు విద్యా విధానంతో స్ఫూర్తి పొందారు.. దేశంలో మొట్టమొదటగా మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించింది తమిళనాడు రాష్ట్రమే.. తమిళనాడు అమలు చేస్తున్న విద్యా విధానం మాకు ప్రేరణ కలిగించింది.. దక్షిణాదికి చెందిన కేరళ, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు తమిళనాడు విద్యా విధానం ఆదర్శంగా నిలిచింది.. తెలంగాణలో మా ప్రభుత్వం, నేను విద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాం.. ముఖ్యమంత్రిగా ఉన్నా విద్యా శాఖ‌ను నా ద‌గ్గరే ఉంచుకున్నా.. మా రాష్ట్రంలో నైపుణ్యత పెంచడానికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీని ప్రారంభించామన్నారు.

Also Read:Group-1: సత్తా చాటిన కానిస్టేబుల్.. గ్రూప్-1 ఫలితాల్లో అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ ఉద్యోగం

తెలంగాణ నుంచి ప్రతి ఏటా 1.10 లక్షల మంది ఇంజినీరింగ్ విద్యార్థులు క‌ళాశాల‌ల నుంచి బ‌య‌ట‌కు వ‌స్తున్నారు.. నైపుణ్యలేమితో ఉద్యోగాలు ద‌క్కక‌పోతుండ‌డంతో వారి స్కిల్స్ పెంచి ఉద్యోగాలు సాధించేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివ‌ర్సిటీ ఏర్పాటు చేశాం.. పీపీపీ విధానంలో ఈ యూనివ‌ర్సిటీ ఏర్పాటు చేశాం.. దానికి ఛైర్మన్‌గా ఆనంద్ మ‌హేంద్రను నియ‌మించాం. కార్పొరేట్ సంస్థల అధిప‌తుల‌ను డైరెక్టర్లుగా నియ‌మించామని సీఎం రేవంత్ తెలిపారు.

Exit mobile version