CM Relief Fund Scam: సెక్రటేరియట్లో దొంగలు.. సీఎం రిలీఫ్ ఫండ్ నిధులే హామ్ ఫట్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Relief Fund Scam:పేదల ఆరోగ్యం కోసం నిధులు కేటాయిస్తే వాటిని కూడా సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్నారు కేటుగాళ్లు. ఏకంగా తెలంగాణ సెక్రటేరియట్ కేంద్రంగానే దందాకు తెరలేపారు. సీఎం రిలీఫ్ ఫండ్ కు చెందిన19 చెక్కుల సొమ్ము కొట్టేశారు. ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు. పేద వారి ఆరోగ్యం కోసం ఉద్దేశించి ప్రభుత్వం నిధి ఏర్పాటు చేసింది. అందులో నుంచి పేదలు ఎవరైనా తీవ్ర అనారోగ్యం పాలైనప్పుడు.. వైద్య ఖర్చుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి డబ్బులు విడుదల చేస్తారు. ఇప్పుడు ఆ నిధులు కొట్టేసేందుకు తెలంగాణ సెక్రటేరియట్లో కొన్ని చీడ పురుగులు తయారయ్యాయి.
కొంత మంది దుండగులు ఏకంగా 19 చెక్కులకు సంబంధించిన డబ్బులను కొట్టేశారు. తాజాగా తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ గోల్ మాల్ వ్యవహారంలో నలుగురిని అరెస్ట్ చేశారు. నిందితులను మెట్టుగూడకు చెందిన జోగుల నరేష్, వనస్థలిపురానికి వెంకటేశ్, ఖమ్మంకు చెందిన వంశీ, పెద్దపల్లికి చెందిన ఓంకార్‌గా గుర్తించారు. వారిని పోలీసులు విచారిస్తున్నారు. తెలంగాణలో ప్రభుత్వం మారడాన్ని వీరు తన సొంత ప్రయోజనం కోసం వాడుకున్నారు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
AI Video: వాస్తవాన్ని తలపించే నకిలీ వీడియో.. వీడియో వైరల్..!
సీఎం రిలీఫ్ ఫండ్‌లో 19 చెక్కుల కోసం ఎవరూ సంప్రదించడం లేదని గుర్తించారు. ఆ డబ్బును ఎలాగైనా కొట్టేయాలని డిసైడ్ అయ్యారు. ఇంకేముంది అనుకున్నదే తడవుగా స్కెచ్చేశారు. ఫోర్జరీ పత్రాలు తయారు చేశారు. తమ సొంత ఖాతాలకు ఆ నిధులను మళ్లించుకున్నారు. నిందితుల్లో ఒకరైన జోగుల నరేశ్ మాజీ మంత్రి పేషీలో పనిచేసినట్లు తెలుస్తోంది. అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందిన వ్యక్తుల పేరుతో జారీ అయిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను కాజేసిన ఘటనలో ఇద్దరు నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
సిద్దిపేట జిల్లా చేరియాల్ మండలానికి చెందిన రాల్లబండి వెంకటేశ్ అనారోగ్య సమస్యలతో 2022 జూన్‌లో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. ఆయనకు సర్జరీ పూర్తయింది. మూడునెలల తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఇటీవల తన సీఎంఆర్ఎఫ్ చెక్కు గురించి వాకబ్ చేయగా రూ.45వేల చెక్కు జారీ అయినట్లు తెలిసింది. ఆ చెక్కు తీసుకుందామని వెళితే అప్పటికే తీసుకుని ఎవరో డబ్బులు డ్రా చేసుకున్నట్లు తేలింది. అంతే కాదు జూబ్లీహిల్స్‌లోని ఎస్బీఐలో చెక్కును వేసి డబ్బులు డ్రా చేసుకున్నట్లు తెలుసుకున్నాడు వెంకటేష్.
Hyderabad: ఇంటి దొంగ దొరికిందోచ్.. బెట్టింగ్‌కి బానిసై అన్న ఇంట్లో చోరీకి పాల్పడ్డ సోదరి..
బాధితుడు వెంకటేష్ తన డబ్బులు గోల్మాల్ అయినట్లుగా గుర్తించి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో దర్యాప్తు చేపట్టి నిందితులైన సికింద్రాబాద్ మెట్టుగూడకు చెందిన జోగుల నరేశ్‌కుమార్, హస్తినాపురం ప్రాంతానికి చెందిన బాలగోని వెంకటేశ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇంకా ఈ వ్యవహారంపై దృష్టిసారించిన పోలీసులకు దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగు చూశాయి. ఖమ్మం జిల్లాకు చెందిన కొర్లపాటి వంశీ, గోదావరిఖనికి చెందిన పులిపాక ఓంకార్ పాత్ర ఉందని పోలీసులు గుర్తించారు. వీరంతా ముఠాగా ఏర్పడి 19 చెక్కులను బ్యాంక్‌లో వేసి డబ్బులు కాజేశారని తేలింది.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..