Site icon NTV Telugu

Monthly Pension: పెళ్లికాని వారికి పెన్షన్ ఇచ్చేది అప్పటి నుంచే.. క్లారిటీ ఇచ్చిన సీఎం..!

Haryana Cm

Haryana Cm

మనం ఇప్పటి వరకు వితంతువులకు, వృద్ధులకు, దివ్యాంగులు పెన్షన్లు ఇవ్వడం చూశాం.. కానీ గత కొన్ని రోజులుగా నిరుద్యోగులకు భృతి ఇస్తామనే హామీ దేశంలో చక్కర్లు కొడుతుంది. నిజానికి ఇది పాలిటిక్స్ లో ఒక ట్రెండుగా మారింది. ఎక్కడ ఎన్నికలు జరిగినా, నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రతి పార్టీ మేనిఫెస్టోలో పెడుతుంది. ఇక ఇదే వరుసలో మరో ట్రెండ్ వస్తుంది. అదేనండి పెళ్లికాని వారికి నెలవారి పెన్షన్ ఇస్తామని హర్యానా ప్రభుత్వం తెలిపింది. ఆడవారైనా, మగవారైనా.. ఎవరికైనా ఈ పథకం వర్తిస్తుందని ఇవాళ (గురువారం) ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది.

Also Read: Early Elections in Andhra Pradesh: ఏపీలో మందస్తు ఎన్నికలు..? క్లారిటీ ఇచ్చిన సజ్జల

ఈ పథకం వచ్చే నెల నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు హర్యానా సీఎం మనోహర్‭లాల్ ఖట్టర్ వెల్లడించారు. అయితే దీనికి కొన్ని షరతుల్ని ఆయన ప్రకటించారు. వయసు 45 దాటి 60 ఏళ్ల లోపు వారికి ఈ పథకం వర్తిస్తుందన్నాడు. అలాగే వారి వార్షికాదాయం రూ. 1.8 లక్షల లోపు ఉండే వారికి నెలకు 2,750 రూపాయల పెన్షన్ అందజేయనున్నట్లు ఖట్టర్ తెలిపారు. వార్షిక ఆదాయం రూ.3 లక్షలకు మించని అదే వయస్సు గల వితంతువులకు, భార్య చనిపోయిన వారికి కూడా ఈ పెన్షన్ వర్తిస్తుందని సీఎం చెప్పారు.

Also Read: NDA Meeting: జూలై 18న ఎన్డీఏ మీటింగ్.. కలిసి వెళ్లేది ఎవరు..?

అయితే ఈ నిర్ణయం వెనుక ఉన్న లాజిక్‌ను సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ తెలియజేశారు. ఒంటరి పురుషుడు, స్త్రీ విషయంలో కొన్ని వ్యక్తిగత అవసరాలు ఉన్నాయి. ఈ నెలవారీ పెన్షన్‌తో ప్రభుత్వం వైపు నుంచి కొంత ఆర్థిక సహాయం వారికి అందాలని ఆయన అన్నారు. పెన్షన్ స్కీమ్‌తో రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ. 240 కోట్లను భరిస్తుందని చెప్పారు.

Also Read: Man Attack on Shopkeeper : దోశ వేయలేనన్న మహిళపై దాడి..

అయితే, హర్యానాలో దాదాపు 65,000 మంది పెళ్లికాని స్త్రీ, పురుషులు ఉన్నాట్లు సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. ఇక నిర్దిష్ట వయస్సుగల వితంతువులు/భార్య చనిపోయిన మగవారు 5,687 మంది ఉన్నారని ఆయన అన్నారు. వీరందరికి ఈ పథకం వర్తిస్తుందని వెల్లడించారు. ఈ లబ్ధిదారులకు 60 ఏళ్లు నిండిన తర్వాత వృద్ధాప్య పింఛను పథకానికి సంబంధించిన వార్షిక ఆదాయ వివరాలను సమర్పిస్తే.. అప్పటి నుంచి వారు వృద్ధాప్య పింఛను పొందుతారని సీఎం ఖట్టర్ చెప్పారు.

Exit mobile version