NTV Telugu Site icon

Mamata Banerjee : నన్ను క్షమించండి రాష్ట్రపతి జీ.. మీరు చాలా మంచివారు.

Mamata Banerjee Nabanna Meeting

Mamata Banerjee Nabanna Meeting

Mamata Banerjee : రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ క్షమాపణ చెప్పారు. ఇటీవల తమ పార్టీ ఎంపీ అఖిల్ గిరి రాష్ట్రపతి పై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించాలని బీజేపీ నేతలు ఫిర్యాదు కూడా చేశారు. మమతా బెనర్జీ ఈ వివాదంపై స్పందించి అందరికీ క్షమాపణలు చెప్పాలనీ పట్టుబట్టారు. ఎట్టకేలకు ఈ వివాదంపై స్పందించిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ క్షమాపణలు చెప్పారు. ‘అఖిల్ గిరి చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెబుతున్నాను. ఆయనపై కఠిన చర్యలు చేపడతాం. పార్టీకి ఆయన వ్యాఖ్యలకు సంబంధం లేదు. ఆయన తప్పు చేశారు. మేం కచ్చితంగా ఖండిస్తున్నాం. ఏ మాత్రం ఆ వ్యాఖ్యలను సమర్థించడం లేదు. ఇలాంటి పదాలు వినియోగించడం సరికాదు’ అన్నారు. అంతే కాకుండా వ్యక్తిగత దాడులు చేయడం తమ పార్టీ సంస్కృతి కాదన్నారు. తాము రాష్ట్రపతి ముర్ముకు ఎంతో గౌరవం ఇస్తామని, ఆమె ఓ స్వీట్ లేడీ అంటూ మమతా బెనర్జీ ప్రశంసలతో ముంచెత్తారు. అందం అనేది బయటికి కనిపించేది కాదని, లోపల ఉండేదని మమత ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. తృణమూల్ మంత్రి అఖిల్ గిరి రాష్ట్రపతిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై బెంగాల్ బీజేపీ ఎమ్మెల్యేలు కొన్ని రోజులుగా నిరసనలు చేస్తున్నారు. ఇవాళ కూడా రాజ్ భవన్ వరకూ ర్యాలీ నిర్వహించారు.