Site icon NTV Telugu

CM KCR: కొత్త ప్రభాకర్‌రెడ్డిని పరామర్శించిన సీఎం కేసీఆర్

Kcr

Kcr

కత్తిపోట్లకు గురైన మెదక్‌ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరామర్శించారు. యశోదా ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్.. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. వైద్యులను అడిగి ప్రభాకర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. దాడిలో తీవ్ర గాయాలపాలైన ప్రభాకర్‌రెడ్డికి డాక్టర్లు సుమారు నాలుగు గంటల పాటు కష్టపడి సర్జరీ చేశారు. చిన్న ప్రేగుకు నాలుగు చోట్ల గాయాలు కావడంతో, పది సెంటీమీటర్ల మేర చిన్నపేగును తొలగించినట్లు యశోదా ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు.

Read also: Off The Record: ఆళ్లగడ్డలో భూమా, గంగుల వర్గాల స్ట్రీట్‌ ఫైట్‌..

ఇక, గ్రీన్‌ ఛానెల్‌తో హైదరాబాద్‌కు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిని తరలించకపోతే మరింత ఇబ్బంది అయ్యేదని యశోదా హస్పటల్ వైద్యులు పేర్కొన్నారు. రక్తం కడుపులో పేరుకుపోయిందని వారు తెలిపారు. ప్రేగుకు నాలుగు చోట్ల గాయాలు కావడంతో సర్జరీ చేయడం ఆలస్యం అయ్యిందని డాక్టర్ల చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ప్రభాకర్ రెడ్డికి ఐసీయూలో చికిత్స కొనసాగిస్తున్నట్లు తెలిపారు. మరో పది రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉండాల్సి వస్తుందని చెప్పారు.

Exit mobile version