CM KCR : కైకాల విలక్షణ నటుడు.. కొంతకాలం మేము కలసి పని చేశాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ (87) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇంటి వద్దే చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన మృతిపై టాలీవుడ్ సినీ లోకం ఆవేదన చెందుతోంది. ఇప్పటికే రాజకీయ, సినీ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు. తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ కైకాల పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. కైకాల విలక్షణ నటుడని, కొంత కాలం మేము కలసి పని చేశామని, ఆయన మన మధ్య లేకపోవడం భాదకరమన్నారు. అంతేకాకుండా.. కైకాల ఎలాంటి పాత్రలోనైనా జీవించి, హీరోలకు సమానమైన పేరు తెచ్చుకుని కేసీఆర్ కొనియాడారు. ఆయన ఎంపీగా ఉన్న రోజుల్లో.. ఆయనతో కలిసి పని చేసిన అనుభవం ఉందని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఓ దిగ్గజాన్ని కోల్పోయిందని, ఆయన లేని లోటు ఎవరూ పూడ్చలేరన్నారు. ఆయనకు సమానమైన నటులు ఈ తరంలో ఎవరూ లేరని, ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నామన్నారు సీఎం కేసీఆర్.
Also Read : IPL Auction 2023 Live Updates: శామ్ కరణ్‌కు రూ.18.5 కోట్లు, గ్రీన్‌కు రూ.17.5 కోట్లు, స్టోక్స్‌కు రూ.16.25 కోట్లు
రేపు ఉదయం 10.30 గంటలకు జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో సత్యనారాయణ అంత్యక్రియలు జరగనున్నాయి. అయితే.. కైకాల 60 సంవత్సరాల సినీజీవితంలో 777 సినిమాల్లో నటించాడు. ఒక నటుడిగా అతను పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలు చేసాడు. హాస్య, ప్రతినాయక, నాయక, భూమికలెన్నిటినో పోషించాడు. తాను పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తుగా అతను నవరస నటనా సార్వభౌమ అనే బిరుదు పొందాడు. తెలుగు సినీ పరిశ్రమలో ఎస్. వి. రంగారావు తర్వాత అలాంటి వైవిధ్య భరితమైన పాత్రలు పోషించిన వారిలో ఈయన ఒకరు. 1959లో సిపాయి కూతురు అనే చిత్రంతో ఈయన సినీరంగప్రవేశం చేశాడు. తర్వాత ఎక్కువగా ప్రతినాయక పాత్రలు పోషించాడు.
Also Read
- CM Vijay: సీఎం విజయ్ ఖాళీ చేసిన తిరుచ్చి స్థానానికి బైపోల్ ఎందుకు జరగలేదు.. కారణమిదేనా?
- Rahul Gandhi: మహిళా పోలీసుకు లైంగిక వేధింపులు.. రాహుల్ గాంధీ నిరసనపై కేంద్రం సంచలనం..
- Delhi: కాంగ్రెస్ ఎంపీపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. జేఎన్‌యూ నుంచి అంగోంచా తొలగింపు
- No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
తాజావార్తలు
-
Anandhi: నిత్యామీనన్‌తో సహా స్టార్ హీరోయిన్లు వద్దనుకున్న కథ.. ఆనంది తలరాత మార్చబోతోందా?
-
CM Vijay: సీఎం విజయ్ ఖాళీ చేసిన తిరుచ్చి స్థానానికి బైపోల్ ఎందుకు జరగలేదు.. కారణమిదేనా?
-
Rahul Gandhi: మహిళా పోలీసుకు లైంగిక వేధింపులు.. రాహుల్ గాంధీ నిరసనపై కేంద్రం సంచలనం..
-
Delhi: కాంగ్రెస్ ఎంపీపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. జేఎన్‌యూ నుంచి అంగోంచా తొలగింపు
-
Tollywood: ‘లక్షలు పోసి మరీ తొక్కేస్తున్నారు..’ టాలీవుడ్లో ఈ పెయిడ్ విషప్రచారం ఎవరి పని?
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు