సీఎం కేసీఆర్ ఆగస్ట్ 1న మహారాష్ట్రలో పర్యటించనున్నారు. మహారాష్ట్ర దళిత నేత అన్నా బావ్ సాటే జయంతి ఉత్సవాల్లో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. అనంతరం కొల్హాపూర్ లోని మహాలక్ష్మి అమ్మవారిని సీఎం కేసీఆర్ దర్శించుకోనున్నారు. ఆ తర్వత సాహు మహారాజ్ మనవడిని కలవనున్నారు సీఎం కేసీఆర్. అనంతరం హైదరాబాద్ కు తిరుగు పయనం కానున్నారు సీఎం కేసీఆర్.
Also Read : UP NEWS: కోచింగ్ సెంటర్ ఆపరేటర్పై కాల్పులు.. తలపై బుల్లెట్ గాయాలు
ఇదిలా ఉంటే.. ఇవాళ.. తెలుగు స్టార్ కమెడియన్ బ్రహ్మానందం దంపతులు సీఎం కేసీఆర్‌ను కలిశారు. బ్రహ్మానందం పెద్ద కొడుకు గౌతమ్‌తో కలిసి ప్రగతి భవన్‌లో చిన్న కొడుకు సిద్ధార్థ్ పెళ్లికి రావాలని సీఎం కేసీఆర్ దంపతులకు ఆహ్వానపత్రికను అందజేశారు. హైదరాబాద్‌లో జరిగే పెళ్లి వేడుకకు తప్పకుండా హాజరుకావాలని కోరారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం-లక్ష్మి దంపతులకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. బ్రహ్మానందం పెద్దకుమారుడు రాజా గౌతమ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. పలు చిత్రాల్లో హీరోగా నటించిన గౌతమ్.. ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు. రెండో తనయుడు సిద్ధార్థ్ గురించి పెద్దగా ఎవరికీ తెలియలేదు. మొదటి నుంచి సినిమాలకు దూరంగా ఉంటూ.. విదేశాల్లో విద్యనభ్యసించారు. అమెరికాలో ఉద్యోగం చేస్తూ అక్కడే స్థిరపడ్డాడు. ఇక సిద్ధార్థ్ ఈ ఏడాది మేలో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే.
Also Read : Errabelli Dayakar Rao : హన్మకొండ వరంగల్ జిల్లాల్లో 418 కోట్ల నష్టం వాటిల్లింది
