Site icon NTV Telugu

CM KCR : గిరిజనులకు పది శాతం రిజర్వేషన్‌.. వారం రోజుల్లో జీవో

Cm Kcr Speech

Cm Kcr Speech

తెలంగాణ జాతీయ స‌మైక్య‌తా వ‌జ్రోత్స‌వాల వేడుక‌ల్లో భాగంగా సీఎం కేసీఆర్ ప‌బ్లిక్ గార్డెన్‌లో జాతీయ జెండా ఎగుర‌వేశారు. వేదిక అధ్యక్షురాలిగా మంత్రి సత్యవతి రాథోడ్ వ్యవహరించారు. ఈ సభకు భారీగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, గిరిజనులు, బంజారాలు హాజరయ్యారు. గిరిజనులకు గిరిజన భాషలోనే ప్రణామాలు చేశారు. అనంత‌రం రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. మేం విసిగి వేసారి పోయాం. సీఎస్ కి సూచిస్తున్నాం. వారం రోజుల్లో 10 శాతం రిజర్వేషన్లకు సంబంధించి జీవో విడుదల చేస్తాం. ఈ జీవోను గౌరవిస్తావా? దాన్నే నీవు నీ ఉరితాడుగా మార్చుకుంటావా? అన్నారు సీఎం కేసీఆర్. దేశంలో ఎన్నో వనరులు వున్నాయి. కరెంట్ వుంది.. ఏడేళ్ళ కిందట కరెంట్ ఎలా వుంటుందో తెలుసు. కష్టపడి మనం కరెంట్ తెచ్చుకున్నాం.

 

బోరుకి మీటరు పెట్టాలంటున్నారు. బావికాడ మీటర్ పెడదామా? పెట్టకూడదు. సులభంగా పరిష్కరించే సమస్యలను పట్టించుకోవడం లేదు. ప్రైవేటైజేషన్ ద్వారా లక్షల కోట్లు భూస్వాములకు పంచేస్తున్నారు. నదుల్లో ప్రవహించే నీరు సముద్రంలో కలవ కూడదు. భారత రాజకీయాలను ప్రభావితం చేయగలిగే శక్తి మనకు వుంది. తెలంగాణ కోసం చేసిన ఉద్యమం మళ్లీ రావాలి. విద్వేష రాజకీయాలను బద్ధలు కొట్టాలి అని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.

 

Exit mobile version