తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే.. బీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది. బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నియోజకవర్గాల వారీగా బహిరంగ సభల్లో పాల్గొంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు జడ్చర్లలో తలపెట్టిన బహిరంగ సభకు హాజరైన ప్రసంగించారు. పాలమూరు ప్రాజెక్టుతో మహబూబ్ నగర్ జిల్లా రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఏమూలకు పోయినా దుఃఖంతో నిండిపోయేదని, మహబూబ్‌నగర్ నీటిగోసపై ఉద్యమ సమయంలో నేను పాట రాశానన్నారు. అప్పట్లో మనుషులే కాదు, అడవులు కూడా బక్కపడ్డాయని, 9 ఏళ్ల పోరాటం తర్వాత అనుమతులు వస్తున్నాయన్నారు సీఎం కేసీఆర్.
Also Read : Putin: పుతిన్‌కి ఘనస్వాగతం పలికిన చైనా.. రష్యాతో స్నేహంపై జిన్‌పింగ్ ప్రశంసలు..
అంతేకాకుండా.. మొన్ననే పాలమూరు పథకాన్ని ప్రారంభించానని ఆయన తెలిపారు. తెలంగాణను ఉత్తిగా ఇవ్వలేదని.. విద్యార్థులను బలి తీసుకొని ఇచ్చారని ఆయన మండిపడ్డారు. శ్రీశైలం ఎవరి అయ్య జాగీరు..? పాలమూరు-ఎత్తిపోతల పథకాన్ని జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్ట్‌కు మార్చామన్నారు. టన్నెల్స్ పుర్తయ్యాయి, మోటార్లు బిగిస్తున్నారన్నారు సీఎం కేసీఆర్. ఇప్పుడు కూడా కొందరు జూరాల నుంచే నీళ్లు తీసుకోవాలని మాట్లాడుతున్నారని, రాబోయే మూడు, నాలుగు నెలల్లో లక్షా 50 ఎకరాలకు సాగునీళ్లు. కరువు మనవైపు కన్నెత్తి కూడా చూడదన్నారు సీఎం కేసీఆర్.
Also Read : ICC Rankings: ఐసీసీ తాజా ర్యాంకింగ్స్ విడుదల.. టీమిండియాదే జోరు..!