Telangana Elections : ప్రజాస్వామ్యంలో ఓటు ప్రతి ఒక్కరి హక్కు. ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేస్తే వాళ్ల ఓటు వాళ్లే వేసుకుంటారు. కానీ సీఎం కేసీఆర్ కు ఆ ఛాన్స్ లేదు. ఆయన పోటీ చేస్తున్న గజ్వేల్, కామారెడ్డి రెండు నియోజకవర్గాల్లోనూ ఆయనకు ఓటు లేదు. కానీ సిద్ధిపేట జిల్లాలోని చింతమడకలో తనకు ఓటు ఉంది. అందువల్ల కేసీఆర్ దంపతులు ఇవాళ ఓటు వేసేందుకు చింతమడకకు వెళ్తారు. గ్రామంలోని 13వ పోలింగ్ కేంద్రంలో వారు ఉదయం 7.30కి ఓటు వెయ్యాలనుకుంటున్నారు. సీఎం కేసీఆర్‌కు చింతమడక గ్రామం సెంటిమెంట్. అక్కడ ఓటు వేయడం ద్వారా తమ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆయన బలంగా నమ్ముతున్నారు. ఇక సీఎం దంపతులు వస్తున్నారని అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.హెలిప్యాడ్, పోలింగ్ కేంద్రం దగ్గర బందోబస్తు ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ (సీపీ) శ్వేత పరిశీలించారు.
ఓట్ల జాబితాలో సీఎం కేసీఆర్ సీరియల్ నంబర్ 158గా ఉంది. ఓటరు కార్డు నంబర్ ఎస్ ఏజీ 0399691. సీఎం కేసీఆర్ భార్య శోభారాణి సీరియల్ నంబర్ 159, ఓటర్ కార్డు నంబర్ ఎస్ ఏజీ 0761676. ఇద్దరి ఇంటి నంబర్లు 3-37. ఓటు వేసేందుకు సీఎం కేసీఆర్ స్వయంగా తమ గ్రామానికి రావడంతో స్థానికులు కొంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అల్లుడు హరీష్ రావు గెలుపు కోసం కేసీఆర్ దంపతులు ఓటు వేయబోతున్నారు. మరోవైపు సిద్దిపేటలోని భరత్‌నగర్ అంబిటస్ స్కూల్‌లోని పోలింగ్ కేంద్రంలో హరీశ్‌రావు దంపతులు ఓటు వేయనున్నారు.
Read Also:Health Tips : చలికాలంలో ఖర్జూరం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా?
అలాగే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అంబర్ పేట నియోజకవర్గం బర్కత్ పురా లోని దీక్షా మోడల్ స్కూల్ లో ఉదయం 7 గంటలకు ఓటు వేస్తారు. ఉదయం 9 గంటలకు ముషీరాబాద్ నియోజకర్గస్థాయిలో శాంతి నికేతన్ కో ఆపరేటివ్ సొసైటీలో బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఓటు వేయనున్నారు. కరీంనగర్ సాధన స్కూల్ లో ఉదయం 9 గంటలకు బండి సంజయ్ ఓటు వేస్తారు. గద్వాల లో 9 గంటలకు డీకే అరుణ ఓటు వేస్తారు. ఉదయం 9 గంటలకు అంబర్ పేట డిడి కాలనీలో మురళీధర్ రావు ఓటు వేయనున్నారు. మలక్ పేట తిరుమల హిల్స్ అసోసియేషన్లో ఉదయం 9 గంటలకు ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి ఓటు వేస్తారు.
అలాగే బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కమలాపూర్ లో 8 గంటలకు సెంట్రల్ ప్రైమరీ స్కూల్ లో ఓటు వేస్తారు. మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు తార్నాక స్ట్రీట్ నెంబర్ వన్ లో ఉదయం 7 గంటలకు ఓటు వేస్తారు. ఉదయం 10 గంటలకు రాం నగర్ జేవీ హై స్కూల్ లో ఓటు వేయనున్న హర్యానా గవర్నర్ దత్తాత్రేయ. మధ్యాహ్నం 2.30 గంటలకు మలక్ పేట సలీం నగర్ లో త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఓటు వేయనున్నారు.
Read Also:Gold Price Today : పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. భగ్గుమంటున్న బంగారం ధర.. తులం ఎంతంటే?
