Site icon NTV Telugu

Constitution Day Wishes: అంబేద్కర్ స్ఫూర్తితోనే తెలంగాణ ప్రయాణం

Kcr

Kcr

భారత రాజ్యాంగం ఆమోదం పొందిన నవంబర్ 26 న జరుపుకునే, ” రాజ్యాంగ దినోత్సవం” సందర్భంగా.. తెలంగాణ ప్రజలకు, దేశ ప్రజలందరికీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలియజేశారు.మహనీయుడు, భారత రత్న డా.బి.ఆర్ అంబేడ్కర్ రూపొందించిన భారత రాజ్యాంగం.. కుల, మత, వర్గ, వర్ణ, ప్రాంత వివక్షకు అతీతంగా, దేశ పౌరులందరినీ సమానంగా పరిగణిస్తుందనీ సీఎం అన్నారు.

ప్రపంచ లిఖిత రాజ్యాంగాలలో భారత రాజ్యాంగానిది ప్రథమ స్థానం అని సీఎం కేసీఆర్ ఆన్నారు. మనుషులందరూ సమానమనే విశ్వమానవ సమానత్వ సిద్దాంతాన్ని భారత రాజ్యాంగం ప్రతిఫలిస్తుందని సీఎం తెలిపారు.సమాఖ్య స్పూర్తిని బలోపేతం చేసే దిశగా, రాజ్యాంగం ద్వారా అంబేడ్కర్ అందించిన ఆర్టికల్ 3 ను అనుసరించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ స్ఫూర్తితోనే పాలన కొనసాగిస్తున్నదని సీఎం అన్నారు.

Read Also:WhatsApp: భారీగా డేటా లీక్.. 50 కోట్ల మంది నంబర్లు అమ్మకానికి!

అంబేడ్కర్ మహాశయుని పేరును తెలంగాణ సచివాలయానికి నామకరణం చేసి రాష్ట్ర ప్రభుత్వం ఘన నివాళి అర్పించిందన్నారు.దేశంలోనే ఎక్కడా లేనివిధంగా హైదరాబాద్ లో 125 అడుగుల ఎత్తైన అంబేడ్కర్ కాంస్య విగ్రహాన్ని నెలకొల్పుతున్నామన్నారు.తెలంగాణలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళా వర్గాలు, పేదల సాధికారత, ఆత్మగౌరవం కోసం పలు పథకాలను రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తూ దేశానికి ఆదర్శంగా నిలవడం లో రాజ్యాంగ స్ఫూర్తి ఇమిడి వున్నదని సీఎం అన్నారు.

పలు ప్రాంతాలు, భాషలు, మతాలు,సంస్కృతి సంప్రదాయాలతో కూడి, భిన్నత్వంలో ఏకత్వం ఫరిడవిల్లే భారత దేశ సమైక్యతను, రాజ్యాంగం అందించిన లౌకిక వాద, సమాఖ్య వాద స్ఫూర్తిని కాపాడుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం కేసిఆర్ పునరుద్ఘాటించారు.

Read Also: Bigg Boss 6: ఈ వారం బిగ్‌బాస్ హౌస్ నుంచి మోడల్ అవుట్..!!

Exit mobile version