NTV Telugu Site icon

CM KCR : దేశంలో వ్యవసాయ సంక్షోభం ఎందుకున్నది

Cm Kcr

Cm Kcr

దేశంలోని 26 రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాల నేతల పర్యటన తెలంగాణలో రెండో రోజు కొనసాగుతోంది. శనివారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన.. ప్రగతి భవన్ లో రైతు సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. చట్టసభల్లో ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాల్సిన వాళ్లు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రజల కోసం పనిచేసే వాళ్లను దేశ పాలకులే ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల నుంచి దేశాన్ని బయటపడేసేందుకు, ప్రజల సంక్షేమం కోరుకునే శక్తులు సంఘర్షించాల్సి ఉంటుంది. ఈ సంఘర్షణ ప్రారంభదశలో మనతో కలిసివచ్చే శక్తులు కొంత అనుమానాలు, అపోహ ఉంటుంది.

 

ఈ అడ్డంకులన్నింటినీ దాటుకొంటూ ఐక్యత సాధించి లక్ష్యాన్ని చేరుకోవాలి. కొత్త రాష్ట్రం తెలంగాణ రైతులందరికీ ఉచిత విద్యుత్ సాగునీటిని అందిస్తుంది. ఇదేపనిని కేంద్రం దేశవ్యాప్తంగా ఎందుకు అమలు చేయదు..? రైతులు కూర్చొని మాట్లాడుకోవడానికి తెలంగాణలో ఉన్నట్లు దేశంలో ఎక్కడైనా కిసాన్ మంచ్ లు ఉన్నాయా? దేశంలో వ్యవసాయ సంక్షోభం ఎందుకున్నది. రైతుల ఆత్మహత్యలు ఎందుకు కొనసాగుతున్నాయి? కేంద్ర పాలకులు ఎందుకు నిర్లక్ష్యం వల్లే అని చర్చించాల్సిన సందర్భం ఇది అని సీఎం కేసీఆర్‌ అన్నారు.

 

Show comments