NTV Telugu Site icon

Pedakurapadu: మే 3న క్రోసూరులో సీఎం జగన్ బహిరంగ సభ: నంబూరు శంకరరావు

Manburu

Manburu

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 3వ తేదీన పెదకూరపాడు నియోజకవర్గానికి విచ్చేస్తున్నారని ఎమ్మెల్యే నంబూరు శంకరరావు తెలిపారు. ఈ పర్యటనకు సంబంధించి సీఎం జగన్ షెడ్యూల్ ఖరారైందని.. 3వ తేదీన క్రోసూరులో వైసీపీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నట్టు ఆయన తెలిపారు. గత ఐదేళ్లలో వైసీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి.. పేదల పాలిట పెన్నిధిగా నిలిచిన ముఖ్యమంత్రి బహిరంగ సభను విజయవంతం చేయాలని పెదకూరపాడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నంబూరి శంకరరావు పిలుపునిచ్చారు.

Read Also: Gold Price Today : మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..

ఇక, పెదకూరపాడు నియోజకవర్గంతో పాటు పల్నాడు జిల్లాలోని వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పెదకూరపాడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నంబూరి శంకరరావు కోరారు. ఈ నెల 3వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు క్రోసూరు మెయిన్ రోడ్డులో బహిరంగ సభ జరుగుతుందని ఆయన తెలిపారు.