NTV Telugu Site icon

CM JaganMohan Reddy: మూడ్రోజుల విశాఖ పర్యటనకు జగన్

Cm Ys Jagan

Cm Ys Jagan

మూడురోజుల విశాఖ పర్యటనకు సీఎం జగన్మోహన్ రెడ్డి గురువారం బయలుదేరి వెళుతున్నారు. మూడు రోజుల పాటు విశాఖ పర్యటనలో సీఎం జగన్ బిజిబిజీగా గడపనున్నారు. రేపు సాయంత్రం నాలుగు గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న ముఖ్యమంత్రి.. నాలుగున్నర కు గన్నవరం విమానాశ్రయం నుంచి విమానంలో విశాఖకు వెళతారు. గురువారంరాత్రికి రుషికొండలోని ఓ హోటల్ లో విడిది చేస్తారు. మూడవ తేదీ ఉదయం 9 గంటలకు ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ వేదిక వద్దకు చేరుకుంటారు సీఎం జగన్.

Read Also:Farooq Abdullah: ముందుగా ఎన్నికల్లో గెలుద్దాం.. ప్రధాని పదవిపై ఫరూఖ్ అబ్దుల్లా..
ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు జీఐఎస్ (Global Investments Summit) ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు ముఖ్యమంత్రి జగన్. గంట పాటు లంచ్ బ్రేక్ ఉంటుంది. అనంతరం మూడు గంటలకు ఎగ్జిబిషన్ ఎరేనాను ప్రారంభించనున్నారు సీఎం. సాయంత్రం మూడున్నర నుంచి ఆరు గంటల వరకు ద్వైపాక్షిక సమావేశాలు ఉంటాయి. రాత్రి 8 గంటలకు జీఐఎస్ అతిథుల కోసం గాలా డిన్నర్ వుంటుంది. అతిథులతో డిన్నర్ లో పాల్గొంటారు ఏపీ సీఎం జగన్.

ఈనెల నాల్గవ తేదీన ఉదయం 9 గంటలకు ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ వేదిక దగ్గరకు సీఎం జగన్ వెళతారు. గంటన్నర పాటు ద్వైపాక్షిక సమావేశాలు, ఒప్పందాలలో పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు వాలెడక్టరీ సమావేశంలో పాల్గొంటారు ముఖ్యమంత్రి జగన్. ఒంటి గంటకు భోజన విరామం ఉంటుంది. మధ్యాహ్నం రెండున్నరకు విశాఖ నుంచి తాడేపల్లికి సీఎం జగన్ తిరుగు ప్రయాణం అవుతారు. ఈ జీఐఎస్ సమ్మిట్ ద్వారా ఏపీకి భారీగా పెట్టుబడులు వస్తాయని భావిస్తున్నారు.

Read Also: Top Headlines @9PM: టాప్‌ న్యూస్‌