కర్నూలు జిల్లాలో ఎల్లుండి ( ఈనెల 19వ తేదీన ) రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎమ్మిగనూరు మండలంలో జగనన్న చేదోడు పథకం నాలుగవ విడతకు సంబంధించి నగదు జమ చేయనున కార్యక్రమానికి వెళ్తున్నారు. ఇక, ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఎమ్మిగనూరు చేరుకోనున్నారు.. అక్కడ వీవర్స్ కాలనీ వైడబ్ల్యూసీఎస్ గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొని, జగనన్న చేదోడు పథకం లబ్ధిదారులకు నిధులు విడుదల చేయనున్నారు.
Read Also: Shahid Afridi: షాహిద్ అఫ్రిది సోదరి మృతి.. కుటుంబంలో విషాదఛాయలు
అయితే, సీఎం జగన్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు వస్తుండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. సీఎం పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ సృజన సంబంధిత అధికారులకు తెలిపారు. ముఖ్యంగా హెలిప్యాడ్ నుంచి సభా ప్రాంగణానికి వచ్చే దారిలో గుంతలు లేకుండా ప్యాచ్ వర్క్, స్పీడ్ బ్రేకర్స్ తొలగించడంతో పాటు సభా ప్రాంగణంలో బ్యారికేడ్లను ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.. అలాగే, విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ అంతరాయం లేకుండా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారులు సైతం అంబులెన్స్ లను అందుబాటులో ఉంచుకోవాలని డీఎం అండ్ హెచ్ఓకు కలెక్టర్ సృజన చెప్పారు. జగనన్న చేదోడు పథకం లబ్దిదారులకు ఇబ్బంది లేకుండా తాగునీరు, స్నాక్స్, భోజన వసతులు ఏర్పాటు చేయాలని పౌరసరఫరాల శాఖ, డీఆర్డీఏ, అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అగ్నిమాపక వాహనాలను ఏర్పాటుతో పాటు సీఎం జగన్ పర్యటన ఏర్పాట్లలో జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలని చెప్పుకొచ్చారు.