Site icon NTV Telugu

CM Jagan: రేపు ‘వైఎస్సార్ వాహన మిత్ర’ 5వ విడత నిధుల విడుదల

Cm Jagan

Cm Jagan

రేపు ‘వైఎస్సార్ వాహన మిత్ర’ నిధులను సీఎం జగన్ విడుదల చేయనున్నారు. వరుసగా ఐదో ఏడాది వైఎస్సార్ వాహన మిత్ర నిధులను విజయవాడలోని విద్యాధరపురంలో వర్చువల్ గా లబ్దిదారుల ఖాతాలో జమ చేయనున్నారు ముఖ్యమంత్రి. ఈ పథకం కింద ఆటో డ్రైవర్లు ఒక్కొక్కరికి రూ. 10 వేల చొప్పున ప్రభుత్వం ఆర్ధిక సహాయం చేస్తుంది. ఈ పథకం కింద 2,75,931 మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరనుంది. రూ.275.93 కోట్ల ఆర్థిక సహాయం చేకూరనుంది. వైఎస్సార్ వాహన మిత్ర పథకం కింద ఇప్పటి వరకు ప్రభుత్వం 1302 కోట్లు అందించింది.

Read Also: Ganesh Visarjan: గంగమ్మ ఒడికి బాలాపూర్ గణపయ్య.. వర్షంలోనూ భక్తుల కోలాహలం

కాగా.. రేపటి పర్యటన కోసం సీఎం జగన్ ఉదయం 10.15 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరనున్నారు. విద్యాధరపురం స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని, బటన్ నొక్కి నిధులు విడుదల చేస్తారు. సభ ముగిసిన అనంతరం తిరిగి తాడేపల్లి చేరుకుంటారు. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది.

Read Also: Movies Releasing: మూవీ లవర్స్ కి పండుగే.. రెండు రోజుల్లో 15 సినిమాలు

Exit mobile version