Site icon NTV Telugu

CM Jagan : నేడు బీసీ నేస్తం నిధులు విడుదల చేయనున్న సీఎం జగన్‌

Jagan

Jagan

మహిళల ఆర్థిక స్వావలంభన లక్ష్యంగా జగనన్న ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అండగా నిలుస్తోంది. బీసీ, ఎస్ సి, ఎస్ టి, మైనారిటీ మహిళలకు భరోసానిచ్చేలా వైఎస్ఆర్ చేయూత, కాపు మహిళల అభ్యున్నతికి కాపు నేస్తం అమలు చేస్తున్న ప్రభుత్వం తాజాగా అగ్రవర్ణ పేద మహిళలకు ఈబిసి పథకాన్ని రూపొందించింది. అగ్ర వర్ణాలలోని పేద మహిళలకు మెరుగైన జీవనోపాధి, ఆర్థిక సాధికారతే లక్ష్యంగా రెడ్డి, కమ్మ, క్షత్రియ, బ్రాహ్మణ, ఆర్య వైశ్య, వెలమ తదితర అగ్రవర్ణ కులాల పేద మహిళలకు వైఎస్సార్ ఈబీసీ పథకం తీసుకొచ్చారు. ప్రతి సంవత్సరం రూ.15 వేలు చొప్పున లబ్ధిదారుల ఖాతాలలో జమ చేయనున్నారు. మొత్తం మూడు సంవత్సరాలలో రూ 45 వేలు జమ చేయనున్నారు. ఈ నెల 14 న అనగా నేడు మూడవ విడత కార్యక్రమాన్ని కేంద్రంగా సీఎం జగన్ ప్రారంభించనున్నారు.

మహిళల ఆర్థిక స్వావలంభన లక్ష్యంగా జగనన్న ప్రభుత్వం అడుగులు వేసింది. అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అండగా నిలుస్తోంది. బీసీ, ఎస్ సి, ఎస్ టి, మైనారిటీ మహిళలకు భరోసానిచ్చేలా వైఎస్ఆర్ చేయూత, కాపు మహిళల అభ్యున్నతికి కాపు నేస్తం అమలు చేస్తున్న ప్రభుత్వం తాజాగా అగ్రవర్ణ పేద మహిళలకు ఈబిసి పథకాన్ని రూపొందించిన విషయం తెలిసిందే. అగ్ర వర్ణాలలోని పేద మహిళలకు మెరుగైన జీవనోపాధి, ఆర్థిక సాధికారతే లక్ష్యంగా రెడ్డి, కమ్మ, క్షత్రియ, బ్రాహ్మణ, ఆర్య వైశ్య, వెలమ తదితర అగ్రవర్ణ కులాల పేద మహిళలకు వైఎస్సార్ ఈబీసీ పథకం తీసుకొచ్చారు. ప్రతి సంవత్సరం రూ.15 వేలు చొప్పున లబ్ధిదారుల ఖాతాలలో జమ చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్లోని EBC నేస్తమ్ పథకం లబ్దిదారులందరికీ శుభవార్త. రాష్ట్రంలోని మహిళా లబ్ధిదారుల ఖాతాల్లో ఈబీసీ నేస్తం పథకం చివరి విడత విడుదల చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. 4,19,583 మంది మహిళా లబ్దిదారుల ఖాతాల్లోకి ఈరోజు నిధులు విడుదల చేయనున్నారు సీఎం వైఎస్‌ జగన్‌. ఈ పథకం కింద 45 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల ఆర్థికంగా బలహీన వర్గాల మహిళలు మరియు ఇతర కులాలకు చెందిన మహిళలు వరుసగా 5 సంవత్సరాలు ప్రతి సంవత్సరం 15000 రూపాయలు అందుకుంటారు.2023-2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మొత్తాన్ని మొదట్లో ఆలస్యం చేసి 2024కి వాయిదా వేశారు. చివరకు ప్రభుత్వం ఈ నిధులను ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా నుండి 2024 మార్చి 14న విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసింది.

Exit mobile version