Site icon NTV Telugu

CM Jagan : నేడు కుప్పంలో సీఎం జగన్ పర్యటన

Jagan

Jagan

CM Jagan Today Tour in Kuppam Constituency

నేడు కుప్పంలో సిఎం జగన్ పర్యటించనున్నారు. జగన్ పర్యటన సందర్భంగా సర్వాంగ సుందరంగా కుప్పం ముస్తాబైంది. కుప్పాన్ని వైసీపీ జెండాలతో నేతలు నింపేశారు. తొలిసారిగా సీఎం హోదాలో కుప్పంకు జగన్ రానున్నారు. అయితే.. way not 175 /175.. ఫస్ట్ టార్గెట్ కుప్పం అంటూ వేసినా పెయింటింగ్స్ ఆకట్టుకుంటున్నాయి. 3వ విడత వైఎస్సార్‌ చేయూత పథకాన్ని ముఖ్యమంత్రి జగన్ కుప్పం నుండి ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 26,39,703 మంది మహిళలకు రూ.4,949.44 కోట్లు లబ్ది అందనుంది. చిత్తూరు జిల్లాలో 1,02,584 మంది లబ్దిదారులకు రూ.192.34 కోట్లు లబ్ది చేకూరనుంది.

పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన 45 నుండి 60 సంవత్సరాల వయసు మధ్య గల అర్హులైన మహిళలకు ఒక్కొక్కరికి 18,750 లను బటన్ నొక్కి ముఖ్యమంత్రి వారి బ్యాంకు ఖాతాలకు జమ చేయనున్నారు జగన్. చిత్తూరు జిల్లాకు చెందిన 1,02,584 మంది లబ్దిదారులకు రూ.192.34 కోట్లు లబ్ది అందనుంది. ఒక్క కుప్పం నియోజకవర్గానికి చెందిన 15,011 మంది మహిళలకు రూ.28.14 కోట్లు అందనున్నాయి.

Exit mobile version