NTV Telugu Site icon

CM Jagan: ఓటు అనే అస్త్రంతో చంద్రబాబుకు సమాధానం చెప్పాలి..

Cm Jagan

Cm Jagan

కృష్ణా జిల్లా మచిలీపట్నం మేమంతా సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వారం రోజుల్లో కురుక్షేత్ర మహా సంగ్రామం జరుగుతోంది.. ఈ ఎన్నికలు ఎమ్మెల్యే, ఎంపీల ఎన్నిక కోసం జరిగే ఎన్నికలు కాదన్నారు. ఇంటింటికి భవిష్యత్లో పథకాల కొనసాగింపు కోసం జరిగే ఎన్నికలని సీఎం జగన్ తెలిపారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలకు ముగింపేనన్నారు. చంద్రబాబు మేనిఫెస్టో అమలు కాని హామీలు అని విమర్శించారు. చంద్రబాబును నమ్మటం అంటే కొండచిలువ నోట్లో తల పెట్టడమేనని ఆరోపించారు. చంద్రబాబును నమ్మటం అంటేనే చంద్రముఖిని నిద్రలేపటమేనని ముఖ్యమంత్రి తీవ్ర విమర్శలు చేశారు.

AP Jobs : ఏపీలో భారీగా ఉద్యోగాలు .. నెలకు రూ.70,000 జీతం..

పేదల వైపు ఉన్న జగన్ పై ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారో ప్రజలకు తెలుసన్నారు. తనపై దుష్ప్రచారం రకరకాలుగా చేస్తున్నారని.. 14 ఏళ్లు పరిపాలన చేసిన చంద్రబాబు గురించి మాట్లాడితే ఒక్క మంచి పని కూడా గుర్తు రాదని దుయ్యబట్టారు. మూడు సార్లు సీఎంగా పనిచేశాను అని చెప్పే చంద్రబాబు పేరుతో ఒక్క పథకం కూడా ఎవరికీ గుర్తు రాదని వ్యాఖ్యానించారు. ప్రైవేట్ అక్వా కంటైనర్లో డ్రగ్స్ తెచ్చాను అంటూ వైసీపీ మీద దుష్ప్రచారం చేశారని అన్నారు. ఆ కంటైనర్ చంద్రబాబు వదినమ్మ బంధువులు అని తెలటంతో అందరూ గప్ చుప్ అయ్యారని తెలిపారు. కిరాణా దుకాణాల్లో గంజాయి అమ్ముతున్నరని సంస్కార హీనంగా దుష్ప్రచారం చేశారు.. ఓటు అనే అస్త్రంతో చంద్రబాబుకి ప్రజలు సమాధానం చెప్పాలని ప్రజలను కోరారు.

Satya:ఏఎల్ విజయ్ మేనల్లుడు హీరోగా ప్రేమలు డైరెక్టర్ కూతురి సినిమా.. ఆసక్తికరంగా ట్రైలర్!

ఇదిలా ఉంటే.. తాజాగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద కూడా దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ల్యాండ్ టైట్లింగ్ అంటే భూములపై రైతులకు, భూ యజమానులకు సంపూర్ణ హక్కులు కలిగించటమే యాక్ట్ ఉద్దేశం అని తెలిపారు. అది కూడా ఈ మూర్ఖులకు తెలియటం లేదని దుయ్యబట్టారు. భూములు కొనాలన్నా, అమ్మలన్నా కొన్ని వివాదాలు వల్ల ఇబ్బందులు ఉన్నాయని పేర్కొన్నారు. దీంతో అధికారులు, కోర్టుల చుట్టూ దశాబ్దాల చుట్టూ తిరుగుతున్నారని చెప్పారు. ఇలా ఇబ్బందులు పడుతున్న వారికి ప్రభుత్వం తరఫున తోడుగా ఉండటమే దీని లక్ష్యం అని అన్నారు. భూముల మీద ఎలాంటి వివాదం లేదని చెప్పటానికి తెచ్చిన సంస్కరణ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని పేర్కొన్నారు. రోవర్లు కొనుగోలు చేసి సచివాలయంలో సర్వేయర్లు పెడుతున్నామని సీఎం తెలిపారు. 2 వేల కోట్లు ఖర్చు చేసి ఇదంతా ప్రభుత్వం చేసిందన్నారు. భూములను స్వేచ్ఛగా అమ్ముకోవాలి.. వివాదాలు ఉండకూడదు.. కోర్టులు, అధికారులు చుట్టూ తిరగకుండా ఉండటానికి ఇది చేస్తున్నానని సీఎం జగన్ తెలిపారు.