Sensational Comments: కాకినాడ జిల్లాలోని రంగరాయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్సార్ పెన్షన్ కానుక పెంపు కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో మరి కుట్రలకు తెరతీస్తారంటూ ఆరోపించారు. రాబోయే రోజుల్లో ఎక్కువగా పొత్తులు పెట్టుకుంటారు. కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేస్తారు.. మీరందరూ అలర్ట్ గా ఉండాలి.. మీ బిడ్డకు వాళ్ల మాదిరి అబద్ధాలు చెప్పడం రాదు అని ఆయన అన్నారు. మీ బిడ్డ నమ్ముకున్నది పైన దేవుడు, ఇక్కడ ప్రజలనే అని పేర్కొన్నారు.
Read Also: Israel: ఇజ్రాయిల్ దాడిలో హమాస్ డిప్యూటీ చీఫ్ హతం.. ఎలాంటి పరిస్థితులకైనా సిద్ధమని వార్నింగ్..
ఇక, ఎన్నికల వేళ టీడీపీ- జనసేన మళ్లీ కుట్రలకు తెరతీస్తారని సీఎం జగన్ పేర్కొన్నారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రజలను అడ్డగోలుగా మోసం చేశారన్నారు. తప్పు చేస్తే ప్రశ్నిస్తానన్న జనసేన అధినేత కనీసం కేంద్రానికి ఒక్క లేఖ కూడా రాయలేదన్నారు. కానీ ఇవాళ పేదలకు ఇస్తున్న ఇళ్లపై అవినీతి జరిగిందంటూ కేంద్రానికి లేఖ రాశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అవినీతిలో పవన్ కళ్యాణ్ కు కూడా భాగం ఉంది.. అందుకే ఈ అవినీతిపరులు… అవినీతికి ఆస్కారం లేకుండా పాలన చేస్తున్న వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారని చెప్పుకొచ్చారు.