Site icon NTV Telugu

CM Jagan : పేదరికానికి కులం ఉండదు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకే ఈబీసీ నేస్తం

Jagan

Jagan

ఏపీ సీఎం జగన్ నేడు నంద్యాల జిల్లాలో పర్యటించారు. మహిళా సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా నిధుల విడుదల చేశారు సీఎం జగన్‌. మహిళా సాధికారత సామాజిక న్యాయానికి సంబంధించిన అంశం మాత్రమే కాదని, ఆర్థిక అనివార్యత కూడా అనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన ఓసీ వర్గాల మహిళలకు ఈబీసీ నేస్తం ద్వారా ఆర్ధిక సాయం చేస్తోంది. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. పేదరికానికి కులం ఉండదన్నారు. . మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకే ఈబీసీ నేస్తమన్నారు. ఆర్థికంగా వెనుకబడిన ఓసీలను ఆదుకుంటున్నాం. ఎక్కడా కులం, వర్గం, మతం, ప్రాంతం చూడడం లేదు. లబ్దిదారులు ఏ పార్టీకి ఓటు వేశారని కూడా చూడడం లేదు. అర్హులైన అన్ని వర్గాల వారికి పథకాలు అందజేస్తున్నాం. పేదరికంతో మహిళలు ఇబ్బంది పడొద్దని ఆయన వ్యాఖ్యానించారు.

 
Mobile Missing : మొబైల్ పోయిందా.. అయితే వెంటనే ఈ పనిచేయండి..!
 

అంతేకాకుండా.. ఈబీసీ నేస్తం పథకంలో కొత్తగా ఆర్థిక సాయం అందుకుంటున్న అక్కచెల్లెమ్మలు 65618 మంది అయితే, 107824 మంది నా అక్కచెల్లెమ్మలు ఇదే ఈబీసీ నేస్తం రెండు సార్లు పొందారు. 3,21,827 మంది అక్కచెల్లెమ్మలు మొత్తంగా మూడు సార్లు వైఎస్సార్ ఈబీసీ నేస్తం ద్వారా లబ్ధి అందుకున్నారు. అదే అక్కచెల్లెమ్మకు వరుసగా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా తోడుగా నిలుస్తూ చేయిపట్టుకుని నడిపించగలిగితే, ఈ డబ్బులతో వ్యాపారం చేసుకునే పరిస్థితి ఉంటుంది. తమ కాళ్లపై తాము నిలబడే పరిస్థితి ఉంటుంది. వారి కుటుంబాలన్నీ బాగు పడే పరిస్థితి వస్తుంది.ూ ఈ వ్యాపారంతో నెలనెలా కనీసం 610 వేలు అదనంగా ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. అని సీఎం జగన్‌ వ్యాఖ్యానించారు.

Adilabad Crime: మానవత్వం మంటగలిపే ఘటన.. చెత్తకుప్పలో నవజాత శిశువు

Exit mobile version