దళారీలు లేకుండా డబ్బులు మీ అకౌంట్లో పడుతున్నాయి. చంద్రబాబును సీఎంని చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయి. చంద్రబాబు, కరువు కవల పిల్లలు. చంద్రబాబుకన్నా అప్పుల వృద్ధిరేటు తక్కువే. చంద్రబాబు హయాంలో ఇన్ని పథకాలు లేవు అన్నారు సీఎం జగన్. వరుసగా నాలుగో ఏడాది రైతు భరోసా.. ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేవారు ఎక్కువయ్యారు. దేవుడి దయతో మంచి నిలబడాలి..అన్ని ప్రాంతాలకు మంచి రోజులు రావాలన్నారు. తన పర్యటన సందర్భంగా ఆళ్ళగడ్డకు వరాలజల్లు కురిపించారు. డీబీటీ ద్వారా రైతుల అకౌంట్లలో డబ్బులు జమచేశారు సీఎం.