NTV Telugu Site icon

Cm JaganMohan Reddy: నరసాపురం రూపురేఖలు మార్చే బాధ్యత నాది

Jagan 11

Jagan 11

కార్తీకమాసం పవిత్రమైన చివరి సోమవారం రోజున రూ. 3300 కోట్లు ఖర్చయ్యే కార్యక్రమాలకు శంకుస్థానలు, ప్రారంభోత్సవాలు నిర్వహించాం అన్నారు సీఎం జగన్. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో ఒకే రోజున ఇన్ని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు బహుశా నర్సాపురం చరిత్రలో ఎప్పుడూ జరగలేదు.ఆంధ్రప్రదేశ్‌ ఫిషరీస్‌ విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేస్తున్నాం. ఇది ఈ ప్రాంతం రూపురేఖలు మార్చబోతోంది. ఆక్వా కల్చర్‌ ఈప్రాంతంలో ప్రధానమైనది.వాటి ఉత్పత్తులు, ఎగుమతుల్లో దేశంలోనే నంబర్‌ ఒన్‌ స్థానంలో ఉంది. ఆక్వాకల్చర్‌లో నైపుణ్యాలను, పరిజ్ఞానాన్ని పెంచేందుకు ఇది తోడ్పడుతుంది. మెరుగైన ఉద్యోగాలు వస్తాయి. దేశంలో ఎక్కడ అవసరాలున్నా.. తీర్చే పరిస్థితి ఉంటుంది.డిప్లమో నుంచి పీహెచ్‌డీ వరకూ ఆక్వా కల్చర్‌లో మానవవనరుల కొరత తీర్చడానికి ఈ యూనివర్శిటీ ఉపయోగపడుతుంది. దేశంలో రెండే రెండు ఫిషరీస్‌ యూనివర్శిటీలు ఉన్నాయి. ఒకటి తమిళనాడులో, ఒకటి కేరళలో ఉంది. మూడో యూనివర్శిటీ మన రాష్ట్రంలో రాబోతోంది.రూ.332 కోట్ల రూపాయల వ్యయంతో ఈ యూనివర్శిటీని ఇక్కడే ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయ్యింది. ఇవాళ్టినుంచి పనులు మొదలు పెడుతున్నాం.

రాష్ట్రంలో మత్స్యకార సోదరుల బాగుకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది.6 వేల మత్స్యకారుల కుటుంబాలకు నర్సాపురంలో.. మేలు చేసేలా ఇక్కడే బియ్యపు తిప్ప ఫిషింగ్‌ హార్బర్‌కూడా కాసేపటి కిందటనే శంకుస్థాపన చేశాం.ఈ ఒక్క బియ్యపు తిప్పి ఫిషింగ్‌ హార్బర్‌ కోసం అక్షరాల రూ.430 కోట్ల రూపాయలు వ్యయం చేయబోతున్నాం. ఈరోజు రాష్ట్రంలో కూడా పూర్తిగా రూపురేఖలు మారబోతున్నాయి. మన మత్స్యకారులు ఎక్కడో గుజరాత్‌కో, ఇంకోచోటుకో వెళ్లి.. బతకాల్సిన అవసరం లేదు. రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా 9 ఫిషింగ్‌ హార్బర్లు రాబోతున్నాయి. దాదాపు రూ.3500 కోట్లు దీనికోసం ఖర్చు చేస్తున్నాం.అన్నిరకాల సదుపాయాలూ ఫిషింగ్‌ హార్బర్‌ ద్వారా అందుబాటులోకి రానున్నాయన్నారు సీఎం జగన్.

Read ALso: CM Jaganmohan Reddy: చంద్రబాబుని చూసి ఇదేం ఖర్మరా బాబూ అంటున్నారు

ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం రోజున దీనికి శ్రీకారం చుడుతున్నాం.ముమ్మడివరంలో ఓఎన్డీజీ కార్యకలాపా ద్వారా ప్రభావితమైన 23వేల మందికి పైగా మత్స్యకారులకు పరిహారాన్ని అందిస్తున్నాం. గతంలో ఇలా పరిహారం అందించిన సందర్భం లేదు. నర్సాపురం అగ్రికల్చర్‌ కంపెనీ భూముల పై రైతులకు పూర్తి హక్కులు కల్పిస్తున్నాం. 1623 మంది రైతులకు మేలు చేస్తున్నాం. ఎన్నికలప్పుడు నేను చెప్పాను.. దాన్ని ఇవాళ నిలబెట్టుకుంటున్నాం.వారికి రిజిస్ట్రేషన్‌ చేసి పట్టాలు ఇవ్వబోతున్నాం.శాశ్వత పరిష్కారంగా ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ చేసి పట్టాలు ఇవ్వబోతోంది.కేవలం ఎకరాకు రూ.100 లు చెల్లిస్తే చాలు.. రైతుల పేరుతోనే భూములు ఇస్తున్నాం. ఉప్పుటేరుపై రెగ్యులేటర్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నాం.

రెగ్యులేటర్‌ నిర్మాణం ద్వారా సముద్రపునీరు కొల్లేరులోకి రాకుండా, ఐదో కాంటూరు వరకూ మంచినీరు నిల్వ ఉండేలా రూ.188 కోట్లతో రెగ్యులేటర్‌, బ్రిడ్జి, లాకు నిర్మాణం చేస్తున్నాం.ఇదే నర్సాపురంలో రూ.1300 కోట్లతో ఏరియా ఆస్పత్రిని కట్టాం. దీన్ని ఇవాళ ప్రారంభించాం. రూ.66 లక్షల విలువైన వైద్య పరికరాలు అందించాం.ఆక్సిజన్‌ ప్లాంటు, జనరేటర్‌కూడా అందించాం.రక్షిత మంచినీటి సరఫరాకోసం శంకుస్థాపన చేశాం. రూ.62 కోట్లు దీనికోసం ఖర్చుచేస్తున్నాం.రూ.4 కోట్లతో నర్సాపురం బస్‌స్టేషన్‌ను ఆధునీకరించాం. దీన్ని ఇవాళ ప్రారంభించాం.ఏనాడో బ్రిటిషర్లు నిర్మించిన ట్రెజరీ బిల్డింగుకు ఇవాళే శంకుస్థాపన చేశాం. వేగంగా అభివృద్ధి చెందుతున్న నర్సాపురంకు నాణ్యమైన విద్యుత్‌ అందించడానికి సబ్‌స్టేషన్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశాం అని వివరించారు సీఎం జగన్.

ప.గో.జిల్లాలో నా పాదయాత్ర జరిగినప్పుడు ఒక విచిత్రమైన పరిస్థితి.తీర ప్రాంతం అంతా తాగునీరు లేక ఇబ్బంది పడే పరిస్థితి. పక్కనే గోదావరి పక్కన ఉన్నా.. తాగడానికి నీరులేదు.బోర్లు వేస్తే.. ఉప్పునీరు… , సర్ఫేస్‌ వాటర్‌ కలుషితం.ఈ ప్రాంతానికి చెందిన ఈ ప్రజలకు తాగునీటి అవసరాలకోసం… ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో రూ.1400 కోట్ల వ్యయంతో ఇవాళ వాటర్‌ గ్రిడ్‌ ద్వారా రక్షిత నీటి సరఫరా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తున్నాం.విజ్జేశ్వరం నుంచి శుద్ధిచేసిన నీటిని… పైపులైన్ల ద్వారాసరఫరా చేస్తున్నాం.

కొత్త జిల్లాలు అయిన ప.గో, ఏలూరు, తూ.గో జిల్లాల్లోని నిడదవోలు, తణుకు, ఆచంట, పాలకొల్లు, నర్సాపురం, భీమవరం, ఉండి, ఉంగుంటూరు, ఏలూరు, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల ప్రజలకు, అలాగే కృష్ణా కృతివెన్ను, బంటుమిల్లి, గుడ్లవల్లేరు మండలాల్లోని ప్రజలకు రక్షిత తాగునీరు అందుతుంది. 18.5 లక్షలమందికి మేలు జరుగుతుందన్నారు సీఎం జగన్. రూ. 87 కోట్లతో నర్సాపురం అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ ఫేజ్‌-1 శంకుస్థాపన చేశాం.అలాగే గోదావరి ఏటి గట్లను పటిష్టంచేస్తాం. శేషావతరం … పంటకాల్వను అభివృద్ధిచేస్తాం.మొగల్తూరు పంటకాల్వ నిర్మాణం పనులనుకూడా ప్రారంభిస్తాం.ఒక్క నర్సాపురం గురించి ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. పాలకొల్లులో మెడికల్‌ కాలేజీ పనులు కూడా ప్రారంభం అయ్యాయి. వశిష్ట బ్రిడ్జికి సంబంధించి జనవరిలో టెండర్లు కూడా పిలుస్తున్నాం అన్నారు జగన్.

Read ALso: Ranveer Singh meets Akon: నువ్వు ఎవరో తెలియదు… రణ్‌వీర్ కి షాక్ ఇచ్చిన రిపోర్టర్