Site icon NTV Telugu

Cm Jagan Mohan Reddy: ఉన్నత విద్యాశాఖపై సమీక్ష.. . ఐటీ, స్కిల్ డెవలప్ మెంట్ పై జగన్ ఫోకస్

Cm Ys Jagan Mohan Reddy

Cm Ys Jagan Mohan Reddy

ఏపీలో ఉన్నత విద్యాశాఖ పై సమీక్ష చేపట్టారు ముఖ్యమంత్రి జగన్. డిగ్రీ చదువుతున్నవారి నైపుణ్యాలను బాగా పెంచాలని జగన్ సూచించారు. వివిధ కోర్సులను పాఠ్యప్రణాళికలో ఇంటిగ్రేట్‌ చేయాలి. విదేశాల్లో విద్యార్థులకు అందిస్తున్న వివిధ కోర్సులను పరిశీలించి వాటిని కూడా ఇక్కడ విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలి. ప్రఖ్యాత కాలేజీల కరిక్యులమ్‌ చూసి, వాటిని మన దగ్గర అమలయ్యేలా చూడాలి. స్వయం ఉపాధిని కల్పించే నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్ వంటి సంస్ధలతో ఈ కోర్సుల కోసం టైఅప్‌ చేసుకోవాలి. రిస్క్‌ ఎనాలసిస్, బ్యాంకింగ్, రిస్క్‌ మేనేజిమెంట్, రియల్‌ ఎస్టేట్‌ వంటి కోర్సులపై దృష్టి పెట్టాలన్నారు.

వచ్చే జూన్‌ కల్లా పాఠ్యప్రణాళికలో ఈ కోర్సులు భాగం కావాలి.ఉన్నత విద్యాశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాం.ఈ ఖాళీల భర్తీపై ప్రత్యేక దృష్టిపెట్టాలి.కోర్టు కేసులను వీలైనంత త్వరగా పరిష్కారం చేసుకుని జూన్‌కల్లా నియామక ప్రక్రియను ప్రారంభించేలా చూడాలి.ప్రతి విద్యాసంస్థ నాక్‌ అక్రిడిటేషన్‌ సాధించాలి.మూడేళ్ల తర్వాత కచ్చితంగా ఉన్నత విద్యాశాఖలోని విద్యాసంస్థలు నాక్‌ అక్రిడిటేషన్‌ సాధించాలి.అలా సాధించలేని పక్షంలో సంబంధిత కాలేజీల గుర్తింపును రద్దు చేయాలి.కళాశాలలకు అనుమతుల విషయంలో కూడా యూనిఫామ్‌ పాలసీ ఉండాలి. వివిధ కోర్సులకు సంబంధించిన కరిక్యులమ్‌ అందించే బాధ్యత స్కిల్‌ యూనివర్సిటీ తీసుకోవాలి.

Read Also: PM Narendra Modi: అభివృద్దే మా ప్రాధాన్యత.. ఓటు బ్యాంకు రాజకీయాలు కావు..

నియోజకవర్గానికి ఒకటి చొప్పున 175 స్కిల్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం.ఆయా జిల్లాల్లో అందుబాటులో ఉన్న పరిశ్రమలకు అనుగుణంగా కోర్సులు ఏర్పాటు చేయాలి.హై ఎండ్‌ స్కిల్స్‌లో భాగంగా.. సాప్ట్‌వేర్‌ స్కిల్స్‌ను కూడా అభివృద్ధి చేయాలి.కోడింగ్, క్లౌడ్‌ సర్వీసెస్‌లాంటి డిమాండ్‌ ఉన్న కోర్సులపై దృష్టి పెట్టాలి.విద్యార్ధులకు సర్టిఫికేషన్‌ఉంటేనే ఎంప్లాయిమెంట్‌ పెరుగుతుంది.ఐటీ, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శాఖలు కలిపి కరిక్యులమ్‌ రూపొందించాలి.సోలార్‌ పార్క్‌లు, సోలార్‌ మోటార్లు, ప్యానెల్స్‌ రిపేరు వంటి వాటిలో నైపుణ్యం కొరత చాలా ఎక్కువగా ఉందన్నారు సీఎం జగన్. ప్రతి నియోజకవర్గంలో ఇవి అందుబాటులో ఉండాలి. ఈ మేరకు కోర్సులు, కరిక్యులమ్, శిక్షణ ఉండాలి. వచ్చే జూన్‌ లక్ష్యంగా ఈ తరహా కోర్సులు ఏర్పాటు చేయాలన్నారు.

Read Also: Etela Rajender : తొలి దళిత రాష్ట్రపతిని చేసింది మోడీ

Exit mobile version