Site icon NTV Telugu

CM Jagan : ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కొనసాగుతున్న జగన్‌ బస్సు యాత్ర

Jagan

Jagan

వైఎస్సాఆర్‌సీపీ ప్రారంభించిన మేమంతా సిద్ధం యాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. నేడు తొమ్మిదవ రోజు ఉమ్మడి నెల్లూరులో జగన్‌ బస్సుయాత్ర జరగనుంది. చింతరెడ్డిపాలెం నుంచి యాత్ర ప్రారంభం కానుంది. కోవూరు క్రాస్‌, సున్నబట్టి, గౌరవరం మీదుగా యాత్ర జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు కావలిలో జగన్‌ సభ నిర్వహించనున్నారు. సభ అనంతరం ఏలూరుపాడు, ఉలవపాడు క్రాస్, సింగరాయకొండ క్రాస్‌ ఓగురు, కందుకూరు, పొన్నలూరు, వెంకుపాలెం మీదుగా యాత్ర సాగించి జవ్వికుంట క్రాస్‌ దగ్గర రాత్రికి సీఎం జగన్‌ బస చేయనున్నారు.

Railway Jobs: పది అర్హతతో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే?

సాయంత్రం కావలిలో జరిగే బహిరంగ సభలో జగన్‌ ప్రసంగిస్తారు. కొవ్వూరు క్రాస్, సున్నబట్టి, తిప్ప, గౌరవరం మీదగా సాగుతుంది. లంచ్‌ బ్రేక్‌ తర్వాత కావలి బహిరంగసభలో పాల్గొంటారు జగన్‌. సభ ముగిశాక… ఏలూరుపాడు, ఉలవపాడు క్రాస్, సింగరాయకొండ క్రాస్, ఓగురు, కందుకూరు, పొన్నలూరు, వెంకుపాలెం వరకు బస్సు యాత్ర సాగుతుంది. రాత్రికి జువ్విగుంట క్రాస్ దగ్గర జగన్‌. కోవూరు సభలో జగన్ నెల్లూరు రాజకీయాల పైన స్పందించే అవకాశం కనిపిస్తోంది. పార్టీకి బలమైన జిల్లా అయిన నెల్లూరులో ఎన్నికల్లో తిరిగి సత్తా చాటాలని జగన్ డిసైడ్ అయ్యారు. దీంతో, నెల్లూరు ఎన్నికల లెక్కలు మరింత ఉత్కంఠ పెంచుతున్నాయి.

Weight Loss : త్వరగా బరువు తగ్గాలంటే వీటిని రోజూ తినాల్సిందే..

Exit mobile version