CM Jagan: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పర్యటనలో సీఎం జగన్ మరోసారి తన ఉదారత చాటుకున్నారు. నరసన్నపేటలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొనేందుకు సీఎం జగన్ వెళ్తుండగా.. ఆయన్ను చూసిన కొంతమంది కలవడానికి ప్రయత్నించారు. అంత రద్దీలోనూ వారిని గమనించిన జగన్.. ‘సభ దగ్గరకు తీసుకురండి.. నేను చూసుకుంటా’ అని సైగ చేశారు. సభా ప్రాంగణం వద్దకు చేరుకున్న వారిని గుర్తించిన జగన్ వారితో మాట్లాడారు. దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న చిన్నారిని పలకరించి భయపడొద్దని భరోసా ఇచ్చారు. తాను చూసుకుంటానని హామీ ఇచ్చారు.
Read Also: VijayaSaiReddy: విజయసాయిరెడ్డి ఫోన్ మిస్సింగ్.. పోయిందా? పడేశారా?
అక్కడే ఉన్న శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌కు ఆ చికిత్స ఇండియాలోనే కాదు ప్రపంచంలో ఎక్కడున్నా అందించాలని, చిన్నారికి అవసరమైన ఆపరేషన్ చేయించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే అక్కడికక్కడే రూ.10వేల పెన్షన్‌ను సీఎం జగన్ మంజూరు చేశారు. కాగా తమ కుమార్తె వైద్యానికి అవసరమైన సాయం చేయాలని ముఖ్యమంత్రికి విజయనగరం జిల్లా చిన్న శిర్లాం గ్రామానికి చెందిన మీసాల కృష్ణవేణి విజ్ఞప్తి చేసింది. తన ఏడేళ్ల కుమార్తె ఇంద్రజ అనారోగ్య సమస్యను సీఎంకు వివరించింది. దీంతో సీఎం జగన్ ఆమె కుమార్తె సమస్యను తెలుసుకుని సహాయం చేయాలని అధికారులను ఆదేశించారు. గతంలోనూ కోనసీమలో వరద బాధితులను పరామర్శించిన సమయంలో అరుదైన వ్యాధితో బాధపడుతున్న హనీ అనే చిన్నారి పరిస్థితిని ఆమె తల్లితండ్రులు ప్లకార్డు ద్వారా ప్రదర్శించి సీఎం జగన్ దృష్టిలో పడ్డారు. ఆ సమయంలో చిన్నారి వైద్యానికి రూ.కోటి మంజూరు చేసి తన మంచి మనసు చాటుకున్నారు.
