NTV Telugu Site icon

Cm Jagan Gokavaram Tour:గోకవరంలో సీఎం జగన్ పర్యటన.. షెడ్యూల్ ఇదే!

Jagan East

Jagan East

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ తూర్పుగోదావరి జిల్లాకు రానున్నారు. గోకవరం మండలం గుమ్మళ్లదొడ్డిలో అస్సాగో ఇండస్ట్రియల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఇథనాల్‌) పరిశ్రమకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు సీఎం అధికారిక పర్యటన షెడ్యూల్‌ విడుదలైంది. శుక్రవారం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లిలోని సీఎం నివాసం నుంచి రోడ్డు మార్గం ద్వారా హెలిప్యాడ్‌ వద్దకు చేరుకుంటారు. 9.35కు తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌ బయలుదేరి 10.30 గంటలకు తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గుమ్మళ్లదొడ్డి గ్రామంలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అనంతరం అక్కడ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 10.40 గంటలకు అస్సాగో ఇండస్ట్రియల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఏర్పాటు చేసిన సభా వేదిక వద్దకు చేరుకుంటారు.

Read Also: Covid 19: సుదీర్ఘకాలం కరోనాతో పోరాటం.. 411 రోజుల తర్వాత కోలుకున్న వ్యక్తి

10.45 నుంచి 11.40 గంటల వరకు శంకుస్థాపన, బహిరంగ సభ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం సభా వేదిక నుంచి 11.45 బయలుదేరి రోడ్డు మార్గంలో 11.50 గుమ్మళ్లదొడ్డి హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 12.10 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి 1.10 గంటలకు తాడేపల్లిలోని సీఎం నివాసానికి చేరుకుంటారు సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. జగన్ పర్యటన నేపథ్యంలో గోకవరంలో ట్రాఫిక్ మళ్లింపు చేపట్టారు పోలీసులు.

ఉదయం 8 నుండి మధ్యాహ్నం 2 గం. వరకు ట్రాఫిక్ డైవర్షన్ వుంటుందని తెలిపారు. రంపచోడవరం వైపు నుంచి రాజమండ్రి వెళ్లే బస్సులు, లారీలు కొత్తపల్లి, జగ్గంపేట మీదుగా మళ్ళిస్తారు. రాజమండ్రి నుంచి గోకవరం వైపుగా వెళ్లే బస్సులు, లారీలు బూరుగుపూడి గేటు నుండి మళ్లించనున్నారు పోలీసులు. వికేంద్రీకరణకు పెద్దపీట వేస్తున్న జగన్ తూర్పుగోదావరి జిల్లాను విభజించాక పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు అడుగులు వేశారు. గుమ్మళ్లదొడ్డిలో అస్సాగో ఇండస్ట్రియల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్ ప్రారంభించడం ద్వారా తొలి అడుగు వేసినట్టయింది. ఈ పరిశ్రమ ద్వారా ఈ ప్రాంతం అభివృద్ధి చెందడంతో పాటు వందలాదిమందికి ఉపాధి లభించనుంది.

Read Also: Black and White Scam: తిరుపతిలో బ్లాక్ అండ్ వైట్ మనీస్కాం